loader

మేడారం జాతరకు కెసిఆర్‌ను ఆహ్వానించిన మంత్రులు

జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. ఈ మహాజాతరకు సర్కార్ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అధికారికంగా అందజేశారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సర్కార్ ఆహ్వానించింది. గురువారం మంత్రులు సీతక్క, కొండా సురేఖలు.. ఎర్రవల్లిలోని కెసిఆర్ నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. మేడారం జాతరకు రావాలని […]

తమిళనాడు ఎన్నికలు.. బీజేపీ-ఏఐఏడీఎంకే మధ్య సీట్లు ఖరారు..?

త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు పొత్తులు, సీట్ల కోసం అప్పుడే కసరత్తు ప్రారంభించాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా, ఏఐఏడీఎంకే కీలక నేత పళనిస్వామి మధ్య సీట్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి పోటీ చేయబోయే సీట్లు, మంత్రి పదవుల విషయంలో అమిత్ షా ఆచితూచి అడుగులేస్తున్నారు. అక్కడ మొత్తం 234 అసెంబ్లీ సీట్లకుగాను, 56 సీట్లు కావాలని అమిత్ షా.. […]

నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు..సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీష్‌ రావు ధ్వజం

నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమన కాండపై మాజీ మంత్రి హరీష్‌ రావు తీవ్రంగా మండిపడ్డారు. నిన్న దిల్‍సుఖ్‍నగర్, నేడు అశోక్ నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నవు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నవని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకు పోరాటం చేస్తాం: రేవంత్ రెడ్డి

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని బిజెపి రద్దు చేయబోతుందని, అధికారం ఉంది కదా అని ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకు పోరాటం చేస్తామని సిఎం పేర్కొన్నారు.

చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత వాళ్లకు లేదు: జెసి ప్రభాకర్

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత వైసిపి వాళ్లకు ఉందా? అని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు జెసి కౌంటర్ ఇచ్చారు. రాయలసీమలిఫ్ట్‌పై వైఎఆస్‌ఆర్‌సిపి వాళ్లు ఏం చేశారని నిలదీశారు. ధర్మవరం మాజీ ఎంఎల్‌ఎ వెంకట్రామిరెడ్డి రాయలసీమకు పౌరుషం లేదని మాట్లాడతున్నారని మండిపడ్డారు. తాడిపత్రి మాజీ ఎంఎల్‌ఎ పెద్దారెడ్డికి పౌరుషం లేదని విమర్శించారు. చీము రక్తం ఉంటే తాడిపత్రి రావాలని సవాల్ విసిరారు. కేతిరెడ్డికి  జగన్ ఈ […]

నాడు ఇందిరమ్మ ధైర్యం- నేడు మోదీ భయం- రాహుల్ ఫైర్!

ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవడానికి “సార్, ప్లీజ్ నేను మిమ్మల్ని చూడొచ్చా?” అని బతిమాలినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “తేడా గమనించండి సార్ జీ!” అంటూ మోదీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాడు అమెరికా బెదిరింపులకు ఏమాత్రం భయపడని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎక్కడ? నేడు అమెరికా అధ్యక్షుడి ముందు చేతులు కట్టుకు నిల్చున్న నరేంద్ర మోదీ ఎక్కడ? అంటూ రాహుల్ ఫైర్​ […]

కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారు… కేటీఆర్

తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని అన్నారు. జనగామ జిల్లాలో ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ మాట్లాడుతూ… మూటలు మోసుడు తప్ప రేవంత్ రెడ్డి ఏం తెల్వదని విమర్శించారు. తెలంగాణను 60 సంవత్సరాల పాటు రాచిరంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని అన్నారు.

తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ – అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ఒకే నియోజకవర్గంలోని మండలాలు మూడు, నాలుగు వేర్వేరు జిల్లాల్లో కలిసి ఉండటం వల్ల అటు ఎమ్మెల్యేలకు, ఇటు సామాన్య ప్రజలకు పాలన దూరమైందని వివరించారు.అందుకే జిల్లాల సరిహద్దులను, రెవెన్యూ డివిజన్లను పునర్ వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి ప్రకటించారు.

పదింతల మూల్యం చెల్లించక తప్పదు..అధికారులకు మాజీ మంత్రి రోజా హెచ్చరిక

వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఏపీకి చెందిన అధికారులను హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు కూటమికి సహకరిస్తున్న అధికారులందరూ పదింతలు మూల్యం చెల్లించక తప్పదని ఘాటుగా వ్యాఖ్యనించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ జైలులు పెడుతుందని, రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తుందని, మహిళలపై దౌర్జన్యాలు, హత్యల వల్ల రాష్ట్రం పరువు పోతుందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నేర నివేదికలో ఏపీకి […]

అస్వస్థతతో హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్టుగా తెలిసింది. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా గాంధీ పరిస్థితి బాగానే ఉందని, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న కారణంగా ఆమెను ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చిందని సమాచారం. ప్రస్తుతం సోనియా పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. సీనియర్ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో సోనియాగాంధీకి వైద్యం అందిస్తున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం కారణంగా అప్పుడప్పుడు చెకప్‌ల కోసం ఆస్పత్రికి వెళ్తుంటారని తెలిసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON