ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత వైసిపి వాళ్లకు ఉందా? అని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు జెసి కౌంటర్ ఇచ్చారు. రాయలసీమలిఫ్ట్‌పై వైఎఆస్‌ఆర్‌సిపి వాళ్లు ఏం చేశారని నిలదీశారు. ధర్మవరం మాజీ ఎంఎల్‌ఎ వెంకట్రామిరెడ్డి రాయలసీమకు పౌరుషం లేదని మాట్లాడతున్నారని మండిపడ్డారు. తాడిపత్రి మాజీ ఎంఎల్‌ఎ పెద్దారెడ్డికి పౌరుషం లేదని విమర్శించారు. చీము రక్తం ఉంటే తాడిపత్రి రావాలని సవాల్ విసిరారు. కేతిరెడ్డికి జగన్ ఈ సారి ఎంఎల్‌ఎ టికెట్ ఇవ్వరని దుయ్యట్టారు.

