loader

కెటిఆర్ ఫోన్ ట్యాప్ చేశారా?… ట్యాప్ అయినందుకు పిలిచారా?: బండి

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను ఫోన్ ట్యాప్ చేసినందుకు పిలిచారా? లేక కెటిఆర్ ఫోన్ ట్యాప్ అయినందుకు పిలిచారా? అని ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సిరిసిల్ల కేంద్రంగా సాగిందని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయల దందా సాగిందని ఆరోపణలు చేశారు. సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి ఎలా లబ్ధిపొందారా తనకు తెలుసుననన్నారు. అన్ని కేసుల్లో సిట్ విచారణలకు ముగింపు ఉంటుందని, ఫోన్ ట్యాపింగ్‌లో మాత్ర సీరియల్‌లా […]

కెసిఆర్ కుటుంబం తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తోంది: అద్దంకి

తెలంగాణను దోచుకున్న దొంగలు.. బిఆర్ఎస్ నేతలు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలే కవిత దోచుకున్నారని, మీ మీద వస్తున్న ఆరోపణలు నాటి హోం మంత్రిపై ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. ఆనాడు మంత్రివర్గాన్ని ఒక డమ్మీ కేబినెట్ గా నడిపించారని, సిఎం రేవంత్ రెడ్డి కేబినెట్ పై అవాకులు.. చెవాకులు […]

సిట్ విచారణకు కేటీఆర్.. తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు బయల్దేరారు. కేటీఆర్ వెంట వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.కేటీఆర్ వెంట హరీశ్‌రావు జూబ్లీహిల్స్ పీఎస్‌కు వెళ్లారు. వారు బయటకు వెళ్లకుండా ఉండేందుకు గేట్లను మూసివేశారు. పోలీసుల చర్యపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా చొరబడుతున్నారని మండిపడ్డారు.

లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్, మంత్రులు

ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. లోకేశ్‌కు మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లు, అభిమానులు పెద్దఎత్తున బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేశ్‌కు పవన్ విషెస్ తెలిపారు.

రేవంత్ అడుగులకు మడుగులొత్తే వాళ్లను వదిలిపెట్టం: కేటీఆర్

సింగరేణి కుంభకోణం వెలికి తీయడంతో తెరపైకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని రూ.50 లక్షలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అలాంటి దొంగ ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నాడని అన్నారు. బామ్మర్ది కాంట్రాక్ట్ రద్దు అయినందుకే రేవంత్ కక్షపూరిత కుట్రలకు పాల్పడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తే వాళ్లను వదిలిపెట్టమని హెచ్చరించారు.

కూటమి ఉన్నంత కాలం జగన్ గెలవరు- పాదయాత్ర వేస్ట్ : విజయసాయిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరైన ఆయన ఏడు గంటల పాటు విచారణ ఎదుర్కొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు. కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారని లేకపోతే ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదన్నారు. కూటమిని విడగొట్టే రాజకీయం.. ప్రస్తుతం ఉన్న కోటరీకి తెలియదన్నారు. కోటరీలో పందికొక్కులు ఉన్నారని.. జగన్ పై పడి తిన్నారని.. ఇప్పటికీ తింటున్నారని అన్నారు.లిక్కర్ స్కాం జరిగినట్లుగా జగన్ కు తెలియదని తెలిసినట్లయితే.. స్కాం చేయించేవారు కాదన్నారు.

రాహుల్, ప్రియాంక మధ్య విబేధాలకు నేనే బాధితుడ్ని.. బీజేపీ సీఎం

గాంధీ కుటుంబంపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల మధ్య విభేదాలు ఉన్నాయని, ఆ పార్టీలో ఉన్నప్పుడు వాటికి తానే బాధితుడ్ని అని ఆరోపించారు. ‘కేరళ వ్యవహారాల్లో ప్రియాంక జోక్యం చేసుకోవడం రాహుల్‌కు ఇష్టం లేదు. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ మధ్య సఖ్యత లేదని, అందుకే ప్రియాంకను కేరళకు బదులుగా అసోం ఎన్నికల కమిటీ బాధ్యతలు అప్పగించారని శర్మ పేర్కొన్నారు.

తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ – విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో భారీ అంచనాలు నెలకొన్న తమిళనాడు వెట్రి కళగం (TVK) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు గుర్తును కేటాయించింది.  డీఎంకే ఉదయసూర్యుడు , అన్నాడీఎంకే రెండాకుల గుర్తులకు ధీటుగా, విజయ్ సారథ్యంలోని టీవీకేకు విజిల్ గుర్తు లభించింది. తమ పార్టీ కోరిన టాప్-10 ప్రాధాన్యతల్లో విజిల్ గుర్తు మొదటి స్థానంలో ఉందని, దీనివల్ల కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొందని పార్టీ ముఖ్య నేత నిర్మల్ కుమార్ […]

ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు – కేటీఆర్‌కు నోటీసులు – శుక్రవారమే ముహుర్తం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నంది నగర్ లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసులు అందించారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇప్పటికే సిట్ ఎదుట హాజరయ్యారు. జూబ్లిహిల్స్ ఏసీపీ ఆఫీసులో కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు.

వైఎస్ జగన్ పాదయాత్ర అందుకోసమే..సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి యనమల

అధికారం అనే కుర్చీ కోసమే వైఎస్ జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తానని ప్రకటించడంపై యనమల ఘాటుగా స్పందించారు. తన స్వార్ధ ప్రయోజనాల కోసమే జగన్ పాదయాత్ర చేస్తానంటున్నారు అని విమర్శించారు. వైఎస్ జగన పాలనలో ప్రజలు నానా కష్టాలు పడ్డారు అని జగన్ అంటే అరాచకం, ధరల పెరుగుదల, సున్నా అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం వంటివే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON