loader

రేపే ఎన్నికల షెడ్యూల్..?

తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికల సందడి మొదలుకానుంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందడంతో, షెడ్యూల్ విడుదల ప్రక్రియ వేగవంతమైంది. అందుకు అనుగుణంగా, రేపు (బుధవారం) లేదా ఒకవేళ కుదరకపోతే తప్పనిసరిగా ఎల్లుండి సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు SEC సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం మరింత వేడెక్కనుంది

రూ. 103 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు…కొడంగల్‌ అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. అలాగే 2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, నియోజకవర్గంలో రూ. 103 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు.

పటాన్‌చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అటాచ్ చేసింది. మధుసూదన్ రెడ్డి‌కి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మధుసూదన్ రెడ్డికి చెందిన కంపెనీ రూ.300 కోట్ల అక్రమాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ రూ.300 కోట్లు అక్రమాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి మధుసూదన్ రెడ్డి రూ.39 కోట్ల రాయల్టీ చెల్లించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇడి ఆయన ఆస్తులను అటాచ్ […]

మంత్రి పీఏ భార్య ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..

మహారాష్ట్ర బీజేపీ మంత్రి పంకజ ముండే పీఏ అనంత్ గార్జే భార్యడాక్టర్ గౌరీ పాల్వే ఆత్మహత్య కేసు సంచలనం రేపుతోంది. గౌరీ ఆత్మహత్యకు ప్రధాన కారణం అనంత్ గార్జే వివాహేతర సంబంధాలే అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది తిరగక ముందే విడిపోవడం విషాదకరం. వివాహం తర్వాత కూడా అనంత్‌కు వివాహేతర సంబంధాలు గౌరికి తెలియడంతో వారిద్దరి మధ్య వాదనలు జరిగేవని,గౌరీని హత్య చేశారని ఆమె కుటుంబం […]

వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,డిప్యూటీ మేయర్ సయద్ తహ్సీన్‌తో నేతృత్వంలో 40 మంది కార్పొరేటర్లు కలెక్టర్‌కు నోటీసు ఇచ్చారు. 2024 జూన్‌లోనే మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఆమె కూటమి పార్టీలు ఆహ్వానించలేదు. కానీ ఇటీవల స్రవంతి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో భేటీ అవడంతో ఆమెను పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.

నా గురించి మాట్లాడితే తాట తీస్తా..నిరంజన్‌కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి చేసిన అవినీతికి వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బపడిందని వ్యాఖ్యలు చేశారు. ఆయన మూడు నాలుగు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని.. చెప్ప లేనంత అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘నా గురించి ఇంకొక్కసారి ఎక్కడైనా మాట్లాడితే నీ తాట తీస్తా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో’ అంటూ నిరంజన్‌ రెడ్డికి కవిత ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

మదనపల్లిలో వైసిపి కార్యకర్తలపై టిడిపి శ్రేణులు దాడి

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైసిపి కార్యకర్తలపై టిడిపి శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. టిడిపి రాష్ట్ర యువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబు ఆరోపణలపై ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు సవాల్ విసిరారు. మదనపల్లి మెడికల్ కాలేజీ వద్ద వైసిపి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టిడిపి, వైసిపి కార్యకర్తలు దాడులకు దిగారు. తమపై టిడిపి కార్యకర్తలు దాడులు చేశారని వైసిపి నాయకులు ఆరోపణలు చేశారు.

పవన్‌ కల్యాణ్‌ 20 ఏండ్ల నుంచి నాకు మంచి ఫ్రెండ్‌.. విజయసాయి రెడ్డి

అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని విజయసాయి రెడ్డి ప్రకటించారు. శ్రీకాకుళంలో ఆదివారం నాడు రెడ్డి సంక్షేమ సంఘం కార్యక్రమంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతానికి నేను రైతును మాత్రమే అని తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. 20 ఏండ్ల క్రితం నుంచే పవన్‌ కల్యాణ్‌ తనకు మిత్రుడని తెలిపారు. తాను ఎప్పుడూ పవన్‌ కల్యాణ్‌ను విమర్శించలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా పవన్‌ కల్యాణ్‌ను విమర్శించనని చెప్పారు.

ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలి: విజయ్

ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనేది మా లక్ష్యమని నటుడు, టివికె అధినేత విజయ్ తెలిపారు. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆడిటోరియంలో స్థానిక సమస్యలపై ప్రజలతో విజయ్‌ ముఖాముఖి మాట్లాడారు. టివికె పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక బైక్‌ ఉండాలని, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని, శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని విజయ్ స్పష్టం చేశారు. వరదలు ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసామని హామీ ఇచ్చారు.

మరికొంత సమయం కావాలి.. స్పీకర్‌కు దానం నాగేందర్‌ లేఖ..!

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ స్పందించారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాశారు. వివరణకు ఇచ్చేందుకు తనకు మరికొంత సమయం కావాలని ఆయన లేఖలో కోరారు. స్పీకర్‌ ఇచ్చిన గడువు ముగియడంతో ఆదివారం మరోసారి లేఖ రాశారు. ఇప్పటికే స్పీకర్‌ రెండుసార్లు దానంకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది విచారణ ముగిసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON