loader

రాహుల్ వ్యాఖ్యలతో పార్లమెంట్లో కలకలం

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తన మాజీ అనుచరుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూపై విమర్శలు గుప్పించారు. బిట్టూ వెళ్తుండగా, రాహుల్ గాంధీ ఆయనను చూపిస్తూ ‘ఇదిగోండి.. ఒక ద్రోహి ఇటుగానే వెళ్తున్నారు.. అతని ముఖం చూడండి’ అని ఎద్దేవా చేశారు.  బిట్టూ వైపు చేయి చాపి ‘హలో బ్రదర్, నా ద్రోహి మిత్రమా.. కంగారు పడకు,  తిరిగి కాంగ్రెస్లోకే వస్తావు” అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బిట్టూ ఆయనను […]

నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన..! ఆ పార్టీ ఎమ్మెల్యేనే అంటున్న సంజయ్

నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన.. ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. జగిత్యాల అబివృద్ధి కోసం రేవంత్ రెడ్డిని కలిసి శాలువ కప్పుకున్నా తప్ప పార్టీ మారలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేను ఎక్కడా చెప్పలేదు, రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేన్నారు. మీడియానే తనపై తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్‌ […]

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. జూన్‌లో ఫిక్స్, ఆ నలుగురు ఎవరు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి పవన్ వెళ్లారు.. ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలో పాటుగా రాజ్యసభ ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో వైఎస్సార్‌సీపీ చేస్తున్న ప్రచారం గురించి కూడా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశం జరిగిన మరుసటి రోజే ఇద్దరు నేతల భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై మరో ఎమ్మెల్యేకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారని నిర్ధారించే సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నట్లు స్పష్టమైన తీర్పును వెలువరించారు. ఇరు పక్షాల వాదనలు, ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం సంజయ్ పార్టీ మారినట్లు నిరూపించే సాక్ష్యాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను […]

బీజేపీ తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 7,8 తేదీల్లో బీజేపీకి మద్దతుగా పవన్‌ ప్రచారం చేయనున్నారు. నిన్న (మంగళవారం) కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావు.. పవన్ కల్యాణ్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మున్సిపల్ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై ముగ్గురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ తరఫున ప్రచారంలో […]

షోలాపూర్‌ మేయర్‌గా తెలుగు నేత

షోలాపూర్‌ మేయర్‌గా తెలుగు వ్యక్తి వినాయక్‌ రామకృష్ణ కొండ్యాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 102 మంది సభ్యుల్లో బీజేపీకి చెందినవారు 81 మంది గెలుపొందారు. ఈ క్రమంలో 12వ వార్డు కార్పొరేటర్‌ వినాయక్‌ రామకృష్ణను మేయర్‌గా ఎన్నుకున్నారు. వినాయక్‌ బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు.ఆయన తాత కొండ్యాల సాయన్న నల్లగొండ జిల్లా సూరేపల్లికి చెందిన వారు. వినాయక్‌ కార్పొరేటర్‌గా 2009, 2012, 2017, 2022లలో ఎన్నికయ్యారు.

వరంగల్‌ భద్రకాళి అమ్మవారిని సేవలో పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా

ఏపీ డిప్యూటీ సీఎం, తెలుగు అగ్ర నటుడు పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా వరంగల్​లో ప్రముఖ ఆలయంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి వెళ్లిన అన్నా లెజినోవాకు ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న సాదర స్వాగతం పలికారు. తొలుత ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్నపన మండపంలో ముఖ్యఅర్చకులు వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్‌ కుమార్‌ శర్మ మహదాశీర్వచనం పలికి అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి, […]

ఢిల్లీలో లోకేశ్ మిషన్, కేంద్రంతో కీలక నిధుల చర్చలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కీలక పర్యటనకు నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి నిధుల సమీకరణ, అభివృద్ధి ప్రాజెక్టుల వేగవంతం, కేంద్ర సహకారం వంటి అంశాలే ఈ పర్యటన ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఢిల్లీలో ఆయనకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీలతో సమావేశమైన లోకేశ్, రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్య అంశాలపై చర్చించారు. రేపు పార్లమెంట్ భవన్లో పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని విత్‌ డ్రా చేయించేందుకు కాంగ్రెస్‌ నేతల ప్రలోభాలు

కాంగ్రెస్‌ నేతలు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అభ్యర్థి నసీమా బేగం నామినేషన్‌ను విత్ డ్రా చేయించే ప్రయత్నం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, కాంగ్రెస్ నేతలు నసీమా బేగం ఇంటికి వెళ్లి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ప్రలోభాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి నసిమా బేగం ఇంట్లో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అభ్యర్థి నసిమా బేగం చివరకు మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంలోనే తాను పనిచేస్తానని […]

మంత్రి మనిషికే నో టికెట్, బావ మరిది రివర్స్..! ఇరకాటంలో పొన్నం

తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మున్సిపల్ ఎన్నికల్లో తన భార్యకు తమ్ముడైన నవీన్ కుమార్ గౌడ్ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించినట్లు సమాచారం. అయితే నవీన్ ‘స్థానికేతరుడు’ (హనుమకొండకు చెందిన వ్యక్తి) అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు.  ఈకారణంతోనే అధిష్టానం కూడా మంత్రి బావ మరిదికి హ్యాండ్ ఇచ్చినట్లుగా సమాచారం. నవీన్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.స్వతంత్ర అభ్యర్థిగానైనా లేదా మరో పార్టీ తరపునైనా నవీన్‌ను బరిలోకి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON