తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల్లో తన భార్యకు తమ్ముడైన నవీన్ కుమార్ గౌడ్ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించినట్లు సమాచారం. అయితే నవీన్ ‘స్థానికేతరుడు’ (హనుమకొండకు చెందిన వ్యక్తి) అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. ఈకారణంతోనే అధిష్టానం కూడా మంత్రి బావ మరిదికి హ్యాండ్ ఇచ్చినట్లుగా సమాచారం. నవీన్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.స్వతంత్ర అభ్యర్థిగానైనా లేదా మరో పార్టీ తరపునైనా నవీన్‌ను బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

