loader

పవన్ ఎన్నికల ప్రచారం రద్దు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచార కార్యక్రమాలు అనివార్య కారణాలతో రద్దయ్యాయి. ఇటీవల జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం చేస్తారని జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటించింది. శనివారం, ఆదివారం ఆయన ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే, ఈ ప్రచారం రద్దు కావడం చర్చనీయాంశమైంది.

జగన్ పర్యటనలో..ఇద్దరు వైసీపీ పార్టీ కార్యకర్తలు మృతి..

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. చిల్లకల్లు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త డి. రాంబాబు (45) స్వాగత ఏర్పాట్లలో భాగంగా జోగి రమేష్‌ నివాసం వద్దకు చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. పల్స్‌ పడిపోవడంతో అక్కడున్న నేతలు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బైక్‌పై స్టంట్‌ చేస్తూ రోడ్డుపై ఉన్న గేట్‌ను వేగంగా ఢీకొని మరో […]

అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు: వైఎస్ జగన్

జోగి రమేష్ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్ జగన్.. ఆపై కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సీబీఐ స్పష్టం చేసింది. ఒక అబద్ధాన్ని సృష్టించి..లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ విష ప్రచారం చేశారు.చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు వైఎస్ జగన్

BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.  పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను అధికారికంగా విడుదల చేశారు.ప్రధాన అంశాల్లో పన్నుల పెంపు లేదు, వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, బస్తీ దవాఖానలు,  100 శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , దేవాలయాల రక్షణ, మహిళల రక్షణ. మున్సిపాలిటీల్లో దోమలు, పందులు, కుక్కలు, కోతుల బెడద నివారణ. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి కోసం బీజేపీ మేనిఫెస్టో […]

కుల, ప్రాంత, భాష విబేధాలున్నా హిందూ ధర్మం ఒక్కటే: పవన్

ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉందని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దేవుళ్లను ఎవరైనా అవమానిస్తే హిందువులు వ్యక్తిగంతంగానే బాధపడతారని అన్నారు. పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. ఎవరు చేసిన కర్మ వారే అనుభవిస్తారని హిందువులు భావిస్తారని, హిందువుల్లో ఈ ఉదాసీన వైఖరి మారాలని పవన్ సూచించారు. కుల, ప్రాంత, భాష విబేధాలున్నా హిందూ ధర్మం ఒక్కటేనని తెలియజేశారు. హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం […]

బాత్‌రూమ్‌క్లీన్ చేసే కెమికల్స్‌తో శ్రీవారి ప్రసాద లడ్డూ తయారీ-చంద్రబాబు సంచలన ప్రకటన

తిరుమల శ్రీవారి లడ్డూ కేసు విషయంలో మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే కెమికల్స్ ను ఉపయోగించి వైసీపీ హయాంలో లడ్డూను తయారు చేశారని ఆరోపించారు. ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగానే తాను మాట్లాడుతున్నానన్నారు. కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ హయాంలోఐదేళ్లు ఆలయాలన్నింటిలోనూ కల్తీ నెయ్యినే ఉపయోగించి ప్రసాదాలు తయారు చేశారన్నారు. శ్రీశైలంలోనూ కల్తీ జరిగినట్లుగా తేలిందని చెప్పారు.

మద్రాస్ హైకోర్టులో హీరో విజయ్‌కు నిరాశ ..రూ.1.5 కోట్ల జరిమానాపై స్టే రద్దు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించి విధించిన రూ.1.50 కోట్ల జరిమానాను రద్దు చేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జరిమానా విధించిన ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వుల్లో ఎలాంటి చట్టవిరుద్ధం లేదని న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి స్పష్టం చేశారు.  2015–16 ఆర్థిక సంవత్సరం విజయ్ తన ఆదాయపు పన్ను రిటర్న్‌లో  ‘పులి’ సినిమా ద్వారా వచ్చిన రూ.15 కోట్ల ఆదాయాన్ని ఖాతాల్లో చూపలేదని […]

కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు : కవిత

తెలంగాణ చరిత్రలో మాజీ సిఎం కెసిఆర్ కు ఒక పుస్తకమే ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరని అన్నారు. హైదరాబాద్ లో జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నామని తెలియజేశారు. కెసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం సిఎం రేవంత్ రెడ్డికి లేదని, కెసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డి తిడుతున్నారని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో నిలదీశాడని.. రాత్రి ఇంటికెళ్లి ఓటర్‌పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 44వ వార్డు నెహ్రూనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. ఓటు వేయమని అడిగిన నాయకులను స్థానికుడు నిలదీశాడు. ఎన్నికలు ఉన్నప్పుడే వస్తారా అని ప్రశ్నించాడు. నాలాలు తీయడం లేదని, ఇతర సమస్యలు ఉన్నాయని వాటిని ముందు పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ఆ ఓటర్ ఇంటికి కాంగ్రెస్ నాయకుడి అనుచరుడు వచ్చాడు. మమ్మల్నే నిలదీస్తావా అని అతనిపై తీవ్రంగా […]

వేలానికి దివంగత సీఎం జయలలిత ఇల్లు!

దివంగత సీఎం జయలలిత నివాసం ‘వేద నిలయం’ను వేలానికి పెట్టే అవకాశం కనిపిస్తోంది. జయలలిత పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను కట్టాల్సి ఉండటంతో.. ఆ శాఖ అధికారులు వేద నిలయాన్ని వేలం వేసేందుకు చూస్తున్నారు. జయలలితకు సంబంధించి ఆదాయ, ఆస్తి పన్నులు రూ.13.69 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. జయలలిత చట్టపరమైన వారసులు ఇప్పటి వరకు రూ.13.69 కోట్లు చెల్లించలేదని తెలుస్తోంది. వడ్డీతో సహా చెల్లించకపోతే.. ‘వేద నిలయం’ను వేలానికి పెట్టే అవకాశం ఉందని ఆదాయ పన్ను […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON