కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించి విధించిన రూ.1.50 కోట్ల జరిమానాను రద్దు చేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జరిమానా విధించిన ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వుల్లో ఎలాంటి చట్టవిరుద్ధం లేదని న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి స్పష్టం చేశారు. 2015–16 ఆర్థిక సంవత్సరం విజయ్ తన ఆదాయపు పన్ను రిటర్న్‌లో ‘పులి’ సినిమా ద్వారా వచ్చిన రూ.15 కోట్ల ఆదాయాన్ని ఖాతాల్లో చూపలేదని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది.

