loader

అతడు నా గన్ మెన్ కాదు…వైసీపీ ఎంపీ గురుమూర్తి

వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. డ్రగ్స్ దందాలో దొరికిన కానిస్టేబుల్ ను తన గన్ మెన్ అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఆ కానిస్టేబుల్ ఇప్పుడు త‌న గ‌న్‌మెన్ కాద‌ని స్ప‌ష్టం చేశారు. పోలీసు శాఖలో పనిచేస్తూ తప్పు చేస్తూ దొరికిపోతే తనకు ఆపాదించడం కరెక్ట్ కాదని అన్నారు. టీడీపీకి, ఆ పార్టీ సోషల్ మీడియాకు ఎదుటివారిపై నిందలు వేయడం, బురదజల్లడం అలవాటుగా మారిందని విమర్శించారు.

ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు సంబంధించి “బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ నాయకులపై కొంచెం ఒత్తిడి తెచ్చినా, వారు భయపడి పారిపోతారు. డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుండి ఫోన్ చేసి.. నరేందర్.. లొంగిపోండి అని అన్నారు. ఇక్కడ, నరేంద్ర మోడీ ‘ఎస్ సార్’ అని యుద్ధం విరమించుకున్నారు” అని రాహుల్ అన్నారు.

కెసిఆర్ కు నోటీసులపై కవిత సీరియస్.. రేపు మహాధర్నా

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా కెసిఆర్ కు నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ఈ నోటీసులు వ్యతిరేకిస్తూ.. బుధవారం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి  రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మహాధర్నా చేపట్టనున్నట్లు  నిర్వహించనున్నట్లు కవిత తెలిపింది.

పాకిస్థాన్‌పై పోరాటం.. హైదరాబాద్‌లో ఒవైసీ పోస్టర్లు!

హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలలో మెట్రో పిల్లర్లపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోస్టర్లు వెలిశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన బ్యానర్లు ఏర్పాటు చేశారు ఎంఐఎం కార్యకర్తలు. శత్రువులకు సరైన విధంగా బుద్ధి చెప్పాలని, మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఇవ్వకూడదని తనదైన శైలిలో ఓవైసీ భారతీయ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వెలసిన ఓవైసీ పోస్టర్లు పార్టీ అభిమానులను, అనుచరులను మరింత ఉత్తేజితులను చేసేలా కనిపిస్తున్నాయి.

ఐపిఎల్ ఫైనల్- టాస్ గెలిచిన పంజాబ్..బౌలింగ్

ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతోంది అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

రాష్ట్ర అవతరణ రోజు కండువా మార్చిన కవిత..?

రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కవిత చేసిన పనికి చాలామంది షాక్ అయిపోతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ముందే జాగృతి పార్టీ ఆఫీస్ ని కొత్తగా ఓపెన్ చేసిన కవిత తాజాగా రాష్ట్ర అవతరణ వేడుకలలో పాల్గొంది. ఇందులో కవిత వేసుకున్న కండువా కూడా మార్చుకుంది. జాగృతి అని ఉన్న కండువాని మెడలో వేసుకుంది.అలాగే  కవిత జై తెలంగాణ.. జై జాగృతి.. జై కేసీఆర్..అని చెప్పింది కానీ జై బీఆర్ఎస్ అని ఒక్కసారి కూడా తన నోటి […]

రూపాయికి ఎకరం- వైఎస్ జగన్‌కు నారా లోకేష్ చాలెంజ్

నారా లోకేష్ రాజీనామా చాలెంజ్ విసిరారు. పోటీగా జగన్ రాజీనామా చేయాల్సింది లేదని క్షమాపణ చెబితే చాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉర్సా కంపెనీలు రూపాయికి ఎకరం భూములు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అది నిజం కాదని మార్కెట్ రేటుకే ఇచ్చామని నారా లోకేష్ అంటున్నారు. ఓ సారి క్లారిటీ ఇచ్చినా జగన్ ఆపకపోవడంతో ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు.

మమతా సర్కార్ శాశ్వతంగా కూలిపోతుంది- అమిత్ షా

బెంగాల్ పర్యటనలో ఉన్న ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ, 2026 లో మమతా బెనర్జీ ప్రభుత్వం శాశ్వతంగా కూలిపోతుందని అన్నారు. “సుభేందు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడినప్పుడల్లా దీదీ భయపడుతుంది. ఎన్నికల్లో మమతా బెనర్జీ హింసకు పాల్పడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని అన్నారు. హింస లేకుండా ఓటు వేయండి, మీరు వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు” అని అమిత్ షా పిలుపునిచ్చారు.

రింకూ సింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ప్రియా సరోజ్..

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఐపీఎల్ రాణించి టీమిండియాకు ఎంపికైన రింకూ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా లోక్‌సభకు ఎన్నికైన ప్రియా సరోజ్ ల నిశ్చితార్థం జూన్ 8న లక్నోలో ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ప్లాన్ చేశాయి. ఎంగేజ్‌మెంట్ అనంతరం నాలుగు నెలలకు వారణాసిలో నవంబర్ 18న రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహ బంధంలోకి అడుగుపెడతారు. వారణాసిలోని తాజ్ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది.

బెంగాల్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్.. తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్

సోషల్ మీడియాలో మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ అరెస్ట్‌‌పై పశ్చిమ్ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా, ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సెక్యులరిజం అనేది రెండు మార్గాలు కలిగిన వీధిలా ఉండాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ‌పై పరోక్షంగా విమర్శించారు. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON