సోషల్ మీడియాలో మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ అరెస్ట్‌పై పశ్చిమ్ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా, ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సెక్యులరిజం అనేది రెండు మార్గాలు కలిగిన వీధిలా ఉండాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పరోక్షంగా విమర్శించారు. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

