loader

లోకేష్ సంచలన ట్వీట్: జగన్ పై తీవ్ర విమర్శలు

కొమ్మినేని డిబేట్‌లో జరిగిన వ్యాఖ్యలకు తమ పార్టీకి, ఛానెల్‌కు సంబంధం లేదని జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారని వైకాపా అధ్యక్షుడు జగన్‌ ట్వీట్ చేశారు. నారా లోకేష్ ఓ వీడియోతో గట్టి కౌంటర్ ఇచ్చారు.అందులో వైఎస్సార్సీపీ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోను ఉంచారు. జగన్ గారు మీ హిపోక్రసీని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది… నాది కాలేజ్ లైఫ్ నీది జైలు లైఫ్- అర్థమైందా రాజా…? జగన్‌కు కౌంటర్‌గా ట్వీట్ చేసిన లోకేష్‌..

ఎపిలో ఆడబిడ్డలకు రక్షణ లేదు: రోజా

ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలకు రక్షణ లేదని మాజీ మంత్రి రోజా తెలిపారు. అధికారంలో ఉన్నవాళ్లే అరాచకాలు చేస్తున్నా హోంమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మహిళలపై దాడులు జరుగుతుంటే పవన్‌ స్పందించడం లేదన్నారు. హామీలు వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రెడ్‌బుక్‌ పేరిట అల్లకల్లోలం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలపై దాడులు జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్టించుకోవలేదన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసు రావుపై తప్పుడు కేసు అరెస్ట్ చేశారని రోజా ధ్వజమెత్తారు.

గుంటూరు నగర మాజీ మేయర్‌ కావటి వైసీపీ నుంచి సస్పెండ్

గుంటూరు నగర మాజీ మేయర్‌ కావటి మనోహర్ నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. కమిషనర్‌తో పడటం లేదంటూ … పార్టీకి సమాచారం ఇవ్వకుండా రాజీనామా చేయడంపై, మేయర్ మీద అవిశ్వాసం పెట్టేందుకు కూటమికి బలం లేదని… తెలిసి కూడా మనోహర్ ఎందుకు రాజీనామా చేశారని ఆరా తీసింది. దీంతో మనోహర్, ఆయనతో పాటు ఇద్దరు కార్పొరేటర్లపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది.

ముగిసిన కాకాణి మూడు రోజుల కస్టడీ

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మూడు రోజుల పాటు అధికారులు విచారించారు. మొదటి రోజు మైనింగ్ కేసుకు సంబంధించి 22 ప్రశ్నలను పోలీసులు సంధించారు. వాటికి సరైన సమాధానం చెప్పలేదట. ఇవన్నీ తప్పుడు కేసులంటూ విచారణ అధికారికి బదులిచ్చారు. కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనమే సమాధానం. అవగాహన లేదు, గుర్తులేదు, మర్చిపోయా.. అంటూ కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

రాహుల్‌గాంధీ ఆరోపణ.. ఘాటుగా స్పందించిన ఈసీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో గెలిచిందన్న రాహుల్‌గాంధీ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారుల మనో ధైరాన్ని దెబ్బతీసే రీతిలో మాట్లాడడం తగదని ఈసీ వివరణ ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్నట్టు వెల్లడించింది. ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికి మళ్లీ అవే ఆరోపణలు చేయడం తగదని ఈసీ వ్యాఖ్యానించింది.

అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

చూస్తున్నా.. అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా అంటూ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు. వన్‌ టైమ్‌ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దంటూ మరోసారి హెచ్చరించారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో తన దగ్గర రిపోర్ట్‌ ఉందన్న ఆయన.. సంక్షేమమే అజెండా జనాల్లోకి వెళ్తే అద్భుత భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఓవర్‌ కాన్ఫిడెన్స్ వద్దు.. ఓటేసిన ప్రజల సంక్షేమమే ముద్దు అంటూ.. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ లో ఎమ్మెల్యేలను మరోసారి హెచ్చరించారు సీఎం చంద్రబాబు.

తెలంగాణలో ముగ్గురు కొత్తమంత్రులు వీరే..

సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ కెబినేట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సి మాల, ఎస్సి మాదిగ, బిసి ముదిరాజ్ నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు. వీరిలో వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. వీరి ముగ్గురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. డిప్యూటీ స్పీకరక్ గా రామచంద్రు నాయక్ ఖరారయ్యారు.

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో సోనియా గాంధీకి చికిత్స కొనసాగుతుంది. అయితే, సోనియా గాంధీని సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు.

మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ మంత్రివర్గం విస్తరణకు ముహుర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఆదివారం రోజున తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. కేబినెట్‌లో మరో ఆరుగురికి చోటు కల్పించేందుకు అవకాశం ఉండగా… ప్రస్తుతానికి ముగ్గురు లేదా నలుగురికి చోటు కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న విద్య, హోం, మైనారిటీ సంక్షేమం వంటి కొన్ని శాఖలను వదులుకోవచ్చు.

టీడీపీకి ఎదురు దెబ్బ.. కడప జిల్లాలో సీనియర్ నేత రాజీనామా..

ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.. మహానాడు జరిగిన పది రోజులకే సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. రాజంపేట టీడీపీలో గ్రూప్ వార్ నడుస్తుండటం, పాలకొండ్రాయుడు మరణంపై చంద్రబాబు స్పందించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON