loader

40 వేల మంది తిరగబడితే ఏం జరిగేదో? వైఎస్ జగన్ సంచలన ట్వీట్‌

ప్రకాశం జిల్లా పొదిలి ఘటనలో నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిపై వైసీపీ శ్రేణులు దాడులు చేశారని కేసులు నమోదు అవుతున్నాయి. ఇక్కడ రాళ్లు, చెప్పులు దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు.” అని ఈ క్రమంలోనే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ చీఫ్‌ వైఎస్ జగన్  ట్వీట్ […]

కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం ‘తొలి అడుగు’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్రకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు వివరించాలి. ఈ కార్యక్రమంలో లీడర్ నుంచి కేడర్ వరకూ ప్రతి ఒక్కరూ విజయయాత్రలో పాల్గొనాలి. ప్రచారం చేసే విషయంలో పోటీ పడాలి.’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

వైసీపీకి మంత్రి నారా లోకేష్ వార్నింగ్

తనపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనంలో రూ.13 వేలు తల్లుల ఖాతాలో వేసి, రూ.2 వేలు తన జేబులో వేసుకుంటున్నానని వైసీపీ ఆరోపణలు చేస్తుందని అన్నారు. అయితే తనపై చేసిన తీవ్రమైన ఆరోపణలను నిరూపించాలని… ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నానని… లేదా వెనక్కి తీసుకోవడం గానీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు.

స్కూల్లో కుమారుడ్ని చేర్పించిన పవన్

ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ISH)లో పవన్ కల్యాణ్ తన కుమారుడ్నిచేర్పించారు. ఆ స్కూల్ అల్ట్రారిచ్, సెలబ్రిటీల పిల్లలకే ప్రత్యేకం అనుకోవచ్చు. మొదట అడ్మిషన్ తీసుకోవడానికే పదిలక్షల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఏడాదికి ఫఈజులు ఇతర ఖర్చులు కలిపి పది లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా. అంటే ఏటా ఇరవై లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కూల్ లో ఫీజుకు తగ్గ ప్రమాణాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో సినీ సెలబ్రిటీలంతా ఇక్కడే చదివిస్తున్నారు.

సుప్రీం తీర్పు బాబుకు చెంపపెట్టు వంటిది: జగన్

ిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న..ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు కు సుప్రీం కోర్టు గట్టిగా బుద్ధి చెప్పిందని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్ జర్నలిస్టు కెఎస్ఆర్ ను వెంటనే విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు వంటిదని అన్నారు. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు..తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదాహం అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

సోమవారం పొద్దున్నే రండి- కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఇంతకు ముందుఓ సారి నోటీసులు జారీ చేసినా.. తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని రాలేనని.. వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు. ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో ఓ సారి ఈడీ ఎదుట కూడా హాజరయ్యారు.

తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు

ముగ్గురు తెలంగాణ కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, న్యాయ, క్రీడల శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, కమర్షియల్ టాక్స్ శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్షణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను ఇచ్చారు. తన వద్ద ఉన్న పదకొండు శాఖల్లో కొన్నింటిని కొత్త మంత్రులకు కేటాయించే ప్రక్రియను పూర్తి చేశారు. సీఎం రేవంత్ వద్ద హోం, మున్సిపల్, విద్య వంటి కీలకమైన శాఖలు ఉన్నాయి.

కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన KCR విచారణ..

ాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అందుకు తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాగు, సాగునీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కూడా కేసీఆర్ కమిషన్‌కు వివరించారని సమాచారం.

కొణిదెల గ్రామానికి డిప్యూటీ సీఎం రూ.50లక్షలు

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలంలో ఈ కొణిదెల అనే గ్రామం ఉంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50లక్షల చెక్కును అందజేసి తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ తొలిసారి కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 9.45 నిమిషాలకు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌ నుంచి బయల్దేరిన కేసీఆర్… 11 గంటలకు కమిషన్ ముందుకు వచ్చారు. ఆయన రాకతో బీఆర్‌కే భవన్ పరిసరాలు పూర్తిగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో నిండిపోయింది. కేసీఆర్‌కు అనుకూలంగా శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాజీ సీఎం విచారణకు వస్తున్నందున ఈ ఉదయం నుంచి బీఆర్‌కే భవన్ పరిసరాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON