loader

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ తొలిసారి కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 9.45 నిమిషాలకు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌ నుంచి బయల్దేరిన కేసీఆర్… 11 గంటలకు కమిషన్ ముందుకు వచ్చారు. ఆయన రాకతో బీఆర్‌కే భవన్ పరిసరాలు పూర్తిగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో నిండిపోయింది. కేసీఆర్‌కు అనుకూలంగా శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాజీ సీఎం విచారణకు వస్తున్నందున ఈ ఉదయం నుంచి బీఆర్‌కే భవన్ పరిసరాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON