ాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అందుకు తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాగు, సాగునీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కూడా కేసీఆర్ కమిషన్‌కు వివరించారని సమాచారం.

