మూడు నెలల్లో కొత్తం సీఎం..కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!
కర్ణాటక సీఎం సీటుపై గత కొంత కాలంగా తీవ్ర చర్చ నడుస్తోంది. సీఎంగా డిప్యూటీ సీఎం డేకె శివకుమార్ బాధ్యతలు చేపట్టబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుతూనే ఉంది. ఈక్రమంలో మరో రెండు, మూడు నెలల్లో డిప్యూటీ సీఎం డికే శివకుమార్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు దక్కే అవకాశం ఉందని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వాఖ్యలు దీనికి మరింత ఆజ్యం పోయడంతో పాటు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

