దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమరణ దీక్ష చేస్తానంటూ దువ్వాడ వాణి సంచలన ప్రకటన చేశారు. టెక్కలి మండలంతో పాటుగా చాలా చోట్ల సర్పంచ్‌లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని..
టెక్కలి మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్యం దారుణంగా ఉందని.. మౌలిక వసతుల నిర్వహణ దిగజారిపోయిందని దువ్వాడ వాణి తెలిపారు. అధికారులు ఈ నిర్లక్ష్యం వీడేంతవరకు టెక్కలిలో ఆమరణ దీక్ష చేపడతానని దువ్వాడ వాణి ప్రకటించారు.

