అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రావడం. ఆయన్ని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏడాదికాలంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రానివ్వకుండా మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. పెద్దారెడ్డి హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నప్పటికీ శాంతిభద్రతల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తూ వస్తున్నారు.

