loader

టీచర్ల సలహాలతోనే పాఠశాలల్లో సంస్కరణలు- నారా లోకేష్

ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తి పట్ల అంకింతభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు ఎం.కల్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి నారా లోకేష్ ‘షైనింగ్ టీచర్’ పేరుతో ఘనంగా సత్కరించారు.

జగన్‌ను కలిసిన సింగయ్య భార్య-లోకేష్‌ మనషులపై ఆరోపణలు- ఈ డ్రామాలేంటని చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆయన కారు కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబం కలిసింది. సింగయ్య భార్య లూర్దూమేరీ తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రకటించారు. సింగయ్య చనిపోయాక మంత్రి లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారన్నారు. అప్పటివరకు బాగా మాట్లాడిన వ్యక్తి అంత సడన్ గా ఎలా చనిపోతాడని ఆమె ప్రశ్నించారు. మనుషుల్ని చంపేసి .. డ్రామాలాడుతున్నారని సింగయ్య భార్యను పిలిపించుకుని అలా చెప్పించారని సీఎం చంద్రబాబు […]

పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు

మధురైలో మురుగన్‌ బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ విద్వేషపూరిత ప్రసంగం చేశారని తమిళనాడులో తీవ్ర దుమారం రేపింది. ‘ఈ సమావేశాల్లో పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రసంగాలు, తీర్మానాలు.. మతం, జాతి, ప్రాంతం ఆధారంగా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించేవిగా, ఇతర వర్గాల మతపరమైన భావాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక సమావేశం ముసుగులో సామరస్యాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో బహిరంగ వ్యాఖ్యలు చేశారు’ అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్‌తోపాటు అన్నామలైపై కూడా కేసు నమోదైంది.

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ..

ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ.. నేడు తన కీర్తికిరీటంలో మరో కలికి తురాయిని చేర్చుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. చైనాకు చెందిన సీపీసీ ఇప్పటివరకూ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉండగా.. కమలం పార్టీ దాన్ని అధిగమించింది. 14 కోట్ల సభ్యత్వాలతో కొత్త చరిత్ర లిఖించింది. శత వసంతాల కాంగ్రెస్ పార్టీతో సాధ్యంకానిది బీజేపీ సాధ్యంచేసింది.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పి.వి.ఎన్ మాధవ్

ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పి.వి.ఎన్ మాధవ్ తెలిపారు. పదవి అనేది గొప్పస్థానం కాదని, అదొక బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్త గర్వపడేలా బిజెపిని తీర్చిదిద్దుతానని తెలియజేశారు. అందరితో కలిసి బిజెపిని బలంగా మారుస్తాం అని మాధవ్ పేర్కొన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరంద్లాజే ప్రకటన చేశారు. రామచందర్‌రావుకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నంచి రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలున్న రామచందర్‌రావు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.

వైఎస్ జగన్‌కు రిలీఫ్.. ఏపీ హైకోర్టు స్టే

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో సింగయ్య మృతి కేసులో ఆయనపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసును కొట్టివేయాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, తదుపరి చర్యలను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో వైఎస్ జగన్‌తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా ఉన్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం.. బీజేపీకి రాజీనామా!

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచల నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ అందజేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి తన సిఫార్సు చేసిన అభ్యర్థిని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆయన, పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పలు విభాగాలలో చేపట్టిన సమీక్షల నేపథ్యంలో, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ప్రకారం, మున్సిపల్ శాఖకు సంబంధించిన సుమారు రూ.3,000 కోట్లు పక్కదారి పడినట్టు గుర్తించారని తెలిపారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ప్రజలపై రూ.10 లక్షల కోట్ల అప్పు మోపారని ఆయన విమర్శించారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ పదవిని పార్టీ అధిష్ఠానం మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుకే అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయన ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఎంపిక తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణకు కొత్త దిశానిర్దేశం చేయనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON