మధురైలో మురుగన్ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని తమిళనాడులో తీవ్ర దుమారం రేపింది. ‘ఈ సమావేశాల్లో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగాలు, తీర్మానాలు.. మతం, జాతి, ప్రాంతం ఆధారంగా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించేవిగా, ఇతర వర్గాల మతపరమైన భావాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక సమావేశం ముసుగులో సామరస్యాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో బహిరంగ వ్యాఖ్యలు చేశారు’ అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌తోపాటు అన్నామలైపై కూడా కేసు నమోదైంది.

