తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరంద్లాజే ప్రకటన చేశారు. రామచందర్రావుకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి నంచి రామచందర్రావు బాధ్యతలు స్వీకరించారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న రామచందర్రావు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.

