loader

కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు ఆయనతో పలు అంశాలపై చంద్రబాబు చర్చించారు. పలు రాష్ట్ర సమస్యలను కేంద్రమంత్రికి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రి అమిత్ షా కు, కేంద్రానికి, ప్రధానికి ధన్యవాదాలు సీఎం చంద్రబాబు […]

హిందీ భాషపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో జరిగిన పీవీ నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన, భాషల ప్రాధాన్యతపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. “మనం హిందీ ఎందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్నలు కొందరిలో వినిపిస్తున్నాయి. కానీ, పీవీ నరసింహారావు గారు 17 భాషలు నేర్చుకున్నారు. ఆయన భాషలలో చేసిన సాధన వల్లే అంత గొప్ప వ్యక్తిగా ఎదిగారు” అని చంద్రబాబు చెప్పారు. హిందీ భాషను వ్యతిరేకించాల్సిన అవసరం లేదని, అదే సమయంలో తెలుగును మరువకూడదన్న స్పష్టత ఉంది.

జగన్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన సరస్వతీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల బదలాయింపు పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో, ఎన్సీఎల్టీ తుది తీర్పును రిజర్వ్ చేసింది. జగన్ తరపు న్యాయవాది వాదనలో, తన అనుమతి లేకుండా కుటుంబ సభ్యులు సంస్థలో తన వాటాను బదలాయించారని పేర్కొన్నారు. విజయమ్మ, షర్మిల తరపు న్యాయవాదులు మాత్రం బదలాయింపు చట్టబద్ధంగానే జరిగిందని, ముందస్తు ఒప్పందం ప్రకారమే జరిగిందని […]

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తాం- తలసాని వార్నింగ్

బీసీలపై నిజంగా ప్రేమ, వారి అభివృద్ధి, సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వం వారికి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, లేకపోతే భూకంపం సృష్టిస్తామని ఒకప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం చూశారు. ఇప్పుడు బిసీల ఉద్యమం చేపడతాం. బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుంటే మీ అధికారాన్ని లాక్కుంటాం’ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

మెదక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనిల్ అనుమానాస్పద మృతి

మెదక్ జిల్లా కొల్చారం మండలానికి చెందిన కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతదేహాన్ని కారులో గుర్తించారు. మెదక్- హైదరాబాద్ రోడ్డు పక్కన వాహనం అదుపుతప్పి ప్రమాదం జరగడంతో చనిపోయాడని తొలుత భావించారు. కానీ ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్లు లభ్యం కావడంతో అనిల్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేశ నేర రాజధానిగా బీహార్..రాహుల్ గాంధీ

బీహార్ లో 11 రోజుల్లో 31 హత్యలు జరగడం.. అక్కడి శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని రాహుల్ విమర్శించారు. ‘‘బీహార్.. దేశ నేర రాజధానిగా మారింది. రాష్ట్రంలోని ప్రతి గల్లీలో భయం, ప్రతి ఇంట్లో అశాంతి నెలకొంది. నిరుద్యోగ యువతను ‘గుండా రాజ్’ హంతకులుగా మారుస్తోంది. సీఎం తన సీటును కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారు. బీజేపీ మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఈసారి ఓటు ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు.. బీహార్‌ను కాపాడటానికి అని ప్రజలు గుర్తుంచుకోవాలి’’ అని […]

అవకాశాల కోసం పరుగెత్తలేదు..అశోక్ గజపతి రాజు

గోవాకు గవర్నర్ గా నియమితులైన తర్వాత అశోక్ గజపతి రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించిన కూడా సమర్ఱవంతంగా నిర్వహించుకుంటూ వచ్చానన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు తనను గవర్నర్ గా సిఫారసు చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. తనకు పదవులపై ఎలాంటి వ్యామోహంలేదని, ఏనాడు అవకాశాలు కావాలని పరుగెత్తలేదన్నారు. తనకు ఏ బాధ్యత ఇచ్చిన సమర్థవంతంగా నిర్వర్తించి.. తానేంటో నిరూపించుకున్నట్లు చెప్పుకొచ్చారు.

కవిత త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతుంది: తీన్మార్ మల్లన్న

ప్రభుత్వ పెద్దలపై తీన్మార్ మల్లన్న విమర్శలు చేశారు. బిసి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తనపై కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేస్తే అండగా నిలవాల్సింది పోయి కవితకు మద్దతు తెలిపి తననే విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవితకు అనధికారిక ఒప్పందం నడుస్తుందని మల్లన్న ఆరోపించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్ రాకంటే ముందే కవిత సంబరాలు చేయడం కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆమెకు అండగా నిలవడం చూస్తుంటే […]

చంద్రబాబు ఫ్రెండ్‌కు కీలక పదవి.. గోవా గవర్నర్‌గా నియమించిన కేంద్రం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కీలక పదవి లభించింది. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజును కేంద్ర ప్రభుత్వం నియమించింది. కొత్తగా మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు.. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్, లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రవీందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన విడుదలైంది.

షేర్ ఆటోలా వాడేస్తున్నారు.. రామోజీ ఫిలిం సిటీకి కూడా హెలికాప్టర్‌లోనే

రాష్ట్ర మంత్రులు హెలికాప్టర్‌ను షేర్‌ ఆటో వాడినట్టు వాడేస్తున్నారు. ఈ వాడకం ఎలా ఉందంటే కనీసం 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం కూడా ఛాపర్‌లోనే వెళ్లివస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఫిల్మ్‌ సిటీలో ఓ సినిమా ప్రారంభంత్సవానికి మంత్రి కోమటిరెడ్డి హాజరుకానున్నారు. దీనికోసం ఆయన బేగంపేట నుంచి పెద్దఅంబర్‌పేటలో ఉన్న ఫిల్మ్‌ సిటీకి హెలికాప్టర్‌లో చేరుకోనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్లీ బేగంపేటకు తిరిగిరానున్నారు. 10, 20 కిలోమీటర్ల దూరం కార్లలో వెళ్లిరావడాని కంటే హెలికాప్టర్‌లోనే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON