తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కీలక పదవి లభించింది. గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజును కేంద్ర ప్రభుత్వం నియమించింది. కొత్తగా మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు.. హర్యానా గవర్నర్గా ఆషింకుమార్ ఘోష్, లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా రవీందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన విడుదలైంది.

