loader

అక్రమ మద్యం పై మంత్రి లోకేశ్ విమర్శలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఘాటు విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో అక్రమ మద్యం కారణంగా రాష్ట్రంలో వేల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడ్డాయని సామాన్యుల జీవితాలు చితికిపోతుంటే, మరోవైపు జగన్ అనుచరులు మాత్రం వేల కోట్లు వెనకేసుకున్నారని ఆయన ఆరోపించారు. పక్కా ఆధారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బయటపెట్టిందని కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, ఇప్పుడు జగన్ ఏం సమాధానం […]

చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే పవన్ కల్యాణ్‌ను సీఎం చేయాలి…

చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళితే పవన్ కల్యాణ్‌‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. కాపులకు సీఎం పదవి కావాలని ఇది వారి ఎన్నో ఏళ్ల కోరిక అని గుర్తుచేశారు. ఆంధ్రా రాజకీయాల్లో కాపు సామాజికవర్గం చాలా బలమైనదని తోట త్రిమూర్తులు గుర్తు చేశారు.చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఎంతో త్యాగం చేశారని…అసెంబ్లీ సీట్లు తక్కువ తీసుకున్నారు అని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దు.. కేరళ ప్రజలకు హరీశ్‌రావు విజ్ఞప్తి

రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని కల్లబొల్లి మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పక్క రాష్ట్రమైన కేరళలో మాత్రం వందల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజాధనాన్ని మంచి నీళ్లలా పారబోస్తున్నారని విమర్శించారు. కేరళ ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల ఫోటోలతో ఇస్తున్న ఫుల్ పేజీ యాడ్స్ చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఒక ఏటీఎంలా మారిందని అర్థమవుతోందని అన్నారు.తెలంగాణలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దని ఈ […]

ఆళ్లగడ్డలో పట్టపగలు వైసిపి నేతపై కత్తులతో దాడి

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని పి వి ఎస్ ఆర్ గోడౌన్ లో వైసిపి నేత శివరామిరెడ్డిను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచారు. ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి కత్తులతో దాడి చెయ్యడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది. టిడిపి ఎంఎల్ఎ అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ తనపై దాడి చేశాడని, తనను చంపడానికి వచ్చినట్లు గుర్తించానని బాధితుడు శివరామిరెడ్డి ఆరోపణలు చేశాడు.

ఇక దాచిపెట్టేది ఏమీ లేదు..మ్యాచింగ్ డ్రెస్ లో జంటగా పెళ్ళికి హాజరైన విజయ్, త్రిష

ిర్మాత కల్పాత్తి ఎస్. సురేశ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు విజయ్, త్రిష జంటగా వచ్చారు. ఇద్దరూ ఒకే కారులో, మ్యాచింగ్ కలర్ దుస్తులు ధరించి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజీపైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి, కాసేపు మాట్లాడి ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ జంట వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇద్దరినీ విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే, మరికొందరు […]

బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా

బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను భారత రాష్ట్రపతికి పంపారు. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, సీవీ ఆనంద్ బోస్​ రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ దాఖ‌లు చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్‌

బీహార్ సీఎం నితీశ్ కుమార్.. ఇవాళ రాజ్య‌స‌భకు నామినేష‌న్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్య‌ద‌ర్శి ఖ్యాతి సింగ్ కార్యాల‌యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స‌మ‌క్షంలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నామినేష‌న్ పేర్ల‌ను అంద‌జేశారు. రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు నితీశ్ త‌న ఎక్స్‌లో వెల్ల‌డించారు. బీహార్‌కు అత్య‌ధిక కాలం సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన వ్య‌క్తిగా నితీశ్ రికార్డు క్రియేట్ చేశారు.

రేవంత్‌ రెడ్డి దోచుకోవడానికే మూసీ పునరుద్ధరణ పనులు : కేటీఆర్‌

మూసీ పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్ అయ్యారు. నాగోల్‌ మూసీ పరీవాహక ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన సుందరీకరణ పనులను గురువారం బీఆర్‌ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. నాడు మూసీలోని మురుగు నీరుని శుద్ధి చేయాలని బీఆర్‌ఎస్ ముందుకెళ్లింది.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇండ్లు కూల్చకండా, భూములు కోల్పోకుండా మూసీని అభివృద్ధి చేశామన్నారు.

‘ఆయన​ అకౌంట్ హైజాక్​​ చేసి ఉండొచ్చు’- నీతీశ్ రాజ్యసభకు వెళ్లడంపై జేడీయూ కార్యకర్తల నిరసనలు

బిహార్ సీఎం పదవిని వదిలి నీతీశ్ కుమార్‌ రాజ్యసభకు వెళ్లడాన్ని జేడీయూ పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. నీతీశ్ రాజ్యసభకు వెళ్లొద్దని, బిహార్‌ సీఎంగానే కొనసాగాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పట్నాలోని నీతీశ్ నివాసం వెలుపల నిరసన చేపట్టారు. బిహార్‌కు మరెవరూ సీఎంగా వద్దని, నీతీశే ఉండాలని నినాదాలు చేశారు. ఆయన అకౌంట్​ను ఎవరైనా హైజాక్​​ చేసి ఉండొచ్చని అంటున్నారు. దీంతో బిహార్‌‌లో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది.

రాజ్యసభకు నీతీశ్‌ కుమార్‌- బిహార్‌ సీఎం పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటన

జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం నీతీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఈసారి రాజ్యసభ ఎన్నికల కోసం తాను నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. నీతీశ్ చేసిన ఈ ప్రకటనతో, ఆయన సీఎం పదవి నుంచి వైదొలగుతారనే అంశంపై క్లారిటీ వచ్చింది. 2005 నుంచి నాన్ స్టాప్‌గా బిహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నీతీశ్, త్వరలోనే దేశంలోని పెద్దల సభలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON