మూసీ పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ పనులను గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. నాడు మూసీలోని మురుగు నీరుని శుద్ధి చేయాలని బీఆర్ఎస్ ముందుకెళ్లింది.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు కూల్చకండా, భూములు కోల్పోకుండా మూసీని అభివృద్ధి చేశామన్నారు.

