రైతుకు నేరుగా రూ.20 వేల భరోసా ఇవ్వండి: షర్మిల డిమాండ్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. “అన్నదాత సుఖీభవ” పథకాన్ని “అన్నదాత దుఃఖీభవ”గా మార్చారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. “సూపర్ సిక్స్” హామీలు అందరికీ వర్తించవు, కేవలం కొంతమందికే వర్తిస్తాయని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉండగా, కేవలం 47 లక్షల మందినే ఎంపిక చేశారని తెలిపారు. 30 లక్షల మంది రైతులను పథకం […]

