బనకచర్లపై నారా లోకేశ్, రేవంత్ రెడ్డి బలం చూసుకొని మాట్లాడుతున్నాడు. బీజేపీ మా చేతుల్లో ఉంది.. మేం ఏం చెప్తే ఆది చేస్తారని ధైర్యంతో.. ఆడిండే ఆట.. పాడిందే పాట అనే ఒక ధైర్యంతో మాట్లాడుతున్నారు. లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతాం అనుమతులు తెచ్చి తీరుతాం అని మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరూ మాట్లాడరు ఖండించరు. దీన్ని బట్టి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని అర్థమవుతుంది.

