loader

ఎన్నికల కమిషన్ పనిచేస్తోందా?.. గత ఎన్నికల్లో భారీగా ఓటర్ల తారుమారు

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం మరోసారి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్‌ ఒకలా ఉండగా, ఫలితాలు మరోలా వచ్చాయని, దీనివల్ల ఎన్నికల్లో మోసం జరిగిందన్న అనుమానాలకు బలమొచ్చిందన్నారు. మహారాష్ట్రలో 40 లక్షలకుపైగా అనుమానాస్పద ఓటర్లు ఉన్నారని “ఈ అనుమానాస్పద ఓటర్లను ఎన్నికల సంఘం ఎందుకు కాపాడుతోంది? ఇది ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి చేసిన కుట్ర. ఎన్నికల డేటాను ఎలక్ట్రానిక్‌గా ఎందుకు ఇవ్వడం లేదు?” అన్నారు.

KTR పేరే డ్రామారావు- రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షను కేటీఆర్ డ్రామాగా అభివర్ణించడాన్ని ఆయన ఖండించారు. కేటీఆర్ పేరే డ్రామారావు అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కుటుంబంలోనే నాటకాలు జరుగుతున్నాయని, ఒకరు బీసీలకు అనుకూలంగా, మరొకరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.

రిజర్వేషన్లు ఇవ్వకపోతే మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్ రెడ్డి

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోదీని గద్దె దించుతాం’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంట్‌లో చర్చించి వెంటనే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘మా డిమాండ్‌ను ఆమోదిస్తారా, లేక రాహుల్ గాంధీని ప్రధానిగా […]

సంక్షేమ పథకాల్లో సీఎం ఫోటో, పేరు వాడొచ్చు..సుప్రీంకోర్టు

తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరును,  ఫోటోలను వాడకుండా నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో పథకాల ప్రచారంలో తమ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పేరు, ఫోటోలను యథావిధిగా ఉపయోగించుకోవడానికి డీఎంకే ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన ఏఐఏడీఎంకే నాయకుడు సి.వి.షణ్ముగంకు సుప్రీం కోర్టు పది లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది.

తెలంగాణ దేవాదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకాలు

దేవాదాయ శాఖలో జరుగుతున్న అవకతవకలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా దేవాలయాల లోపల పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. మంత్రి కొండా సురేఖ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ ఈ అవకతవకలు ఆగకపోవడం భక్తులలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ప్రసాద విక్రయ కౌంటర్లు, గోశాలల నిర్వహణ, క్యూలైన్ల పర్యవేక్షణ వంటి పలు ఉద్యోగాలకు నియామకాలు పేరుతో దళారులు భారీ మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

అమరావతి నిర్మాణంలో అవినీతి- జగన్

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అమరావతి ప్రాజెక్టులో భారీగా కమిషన్ దందా జరుగుతోందని ఆరోపించారు. ఒక సాధారణ భవనం నిర్మాణానికి హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి నగరాలలో చదరపు అడుగుకు రూ.4,000 నుండి రూ.5,000 ఖర్చవుతుందని, కానీ అమరావతిలో అది రూ.10,000లకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంలో ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ‘మొబిలైజేషన్ అడ్వాన్స్’ పేరుతో గుత్తేదారులకు 10 శాతం అడ్వాన్స్ ఇచ్చి, అందులో నుంచి 8 శాతం తిరిగి వెనక్కి […]

చర్చకు రానున్న కేసీఆర్..?

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు  అసెంబ్లీలోనే బదులివ్వనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. సభకు దూరంగా ఉన్న కేసీఆర్, ఈసారి తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశం, డిజైన్లు, నిర్మాణం వంటి అన్ని అంశాల గురించి ఆయన సభలో వివరించనున్నారు. కేసీఆర్ సభకు హాజరైతేనే ప్రజల్లో ప్రభుత్వ వాదన నిజం కాదని చెప్పే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు […]

ఈవీఎంలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలకు తెరతీశారు. ఈవీఎంల విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయని.. వాటిని రద్దు చేసి.. తిరిగి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని.. కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. అయితే తమ పార్టీ గుర్తు అయిన కారుతో పోలి ఉన్న గుర్తులను.. ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించాలని గత కొన్నేళ్లుగా తాము తీవ్ర పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలను పారదర్శక పద్ధతిలో నిర్వహించాలని సూచించారు.

కలియుగం ఎలా ఉంటుందో కనిపిస్తోంది.. చంద్రబాబు పాలనపై వైఎస్‌ జగన్‌ సెటైర్లు

ఏపీలో చంద్రబాబు పాలన చూస్తుంటే కలియుగం అంటే ఎలా ఉంటుందో కనిపిస్తుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా బురదవేసి కడుక్కోమంటున్నారని విమర్శించారు  వైసీపీ లీగల్ సెల్‌ ప్రతినిధులతో మంగళవారం నాడు వైఎస్‌ జగన్‌ను సమావేశమయ్యారు.  అక్రమ కేసులు ఎదుర్కొంటున్న నాయకులు, కార్యకర్తలకు న్యాయ సహాయం అందించాలని సూచించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లాయర్లు అందించిన సేవను ఎప్పటికీ మరిచిపోమని […]

ఆక్రోశం వెళ్లగక్కిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!

పదవి కోసం ఎవరినీ అడగను అని.. తాను ఎవరికాళ్లు మొక్కి పదవి తీసుకోదలచుకోలేదని, తనకు పదవులు అవసరం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెగేసి చెప్పేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే నాకిప్పటికే మంత్రి పదవి వచ్చేది.. కానీ మునుగోడు ప్రజల కోసం నేను ఆ అవకాశాన్ని వదిలేశాను అంటూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకూ, తనకంటూ జూనియర్లకూ పదవులు ఇచ్చారని నేను మాత్రం ఆ పదవుల కోసం ఎవరికాళ్లూ మొక్కను అంటూ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON