loader

వారికి రక్షా బంధన్ కానుక పంపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రక్షాబంధన్ సందర్భంగా తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని వితంతు మహిళలకు చీరలు పంపించారు. పిఠాపురం నియోజకవర్గంలోని 1,500 మంది వితంతు మహిళలకు పవన్ కల్యాణ్ రాఖీ కానుక పంపారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసైనికుల ద్వారా ఈ కానుకలను పంపించారు. పిఠాపురం శాసనసభ్యుడిగా మాత్రమే కాకుండా, ఒక సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా పవన్ కల్యాణ్ ఈ కానుకలు పంపినట్టుగా తెలిపారు.

మంత్రి లోకేశ్, బీటెక్ రవిల నుంచి ప్రాణహాని…వైసీపీ నేత సతీష్ రెడ్డి

పులివెందులలో పోలీసులు పచ్చ కండువా వేసుకొని తిరుగుతున్నారన్నారు. తనకు మంత్రి నారా లోకేశ్, బీటెక్ రవిల నుంచి ప్రమాదం ఉందనే విషయం కొంతమంది టీడీపి వర్గీయుల ద్వారానే సమాచారం అందిందన్నారు. తనకు ప్రాణహాని జరగబోతోంది సమాచారం ఉంది అని ఆరోపించారు. తనను రక్షించాల్సిన బాధ్యత పోలీసులదేనని అలా కాకుండా ఏదైనా జరిగితే.. దానికి బాధ్యులు మంత్రి లోకేష్.. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాత్రమే నని వైసీపీ నేత సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

EC ఆఫీస్ ఎదుట వైసీపీ నేతల మెరుపు ధర్నా

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు విజయవాడలోని ఎన్నికల సంఘం (EC) కార్యాలయం ఎదుట ఆకస్మిక ధర్నాకు దిగారు. తమను ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి పోలీసులు అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగు నాగార్జునతో పాటు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, టీజేఆర్ సుధాకర్, కైలే అనిల్, పూనూరు గౌతమ్ పాల్గొన్నారు.

వైఎస్సార్ విగ్రహాన్ని దొంగల్లా తొలగించారు : దేవినేని అవినాశ్

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగింపు చుట్టూ భారీగా ఉద్రిక్తత నెలకొంది నందిగామ గాంధీ సెంటర్ వద్ద ట్రాఫిక్‌కు అడ్డుగా ఉందని చెప్పుతూ మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించారు. విగ్రహం తొలగింపును ఖండిస్తూ వైసీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా దేవినేని అవినాశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “అధికారులు కోర్టు చెప్పే వరకు విగ్రహాన్ని తొలగించబోమన్నారు. కానీ అర్ధరాత్రి దొంగల్లా తీసేశారు,” […]

48 గంటల్లోగా క్షమాపణ చెప్పు…లేదంటే కోర్టుకు లాగుతా

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ… బండి సంజయ్‌కు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియదని, అలాగే కనీస పరిజ్ఞానం కూడా లేదని విమర్శించారు. బండి సంజయ్‌ నిర్లక్ష్యంతో చేస్తున్న వ్యాఖ్యలు హద్దు మీరాయని కేటీఆర్‌ అన్నారు.బండి సంజయ్ 48 గంటల్లోగా చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే బండి సంజయ్‌ను కోర్టుకు లాగుతామని చెప్పారు. కేంద్రమంత్రిగా పనిచేయడమంటే ఢిల్లీ బాసుల చెప్పులు మోసినంత ఈజీ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ కి జగ్గారెడ్డి కౌంటర్

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐ చేత విచారణ జరిపించాలని,సీఎం రేవంత్ రెడ్డే ఫోన్ ట్యాపింగ్ బాధితుడని, అయినా ఇప్పటి వరకూ ఈ కేసులో ఒక్క అరెస్ట్ కూడా జరగలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తక్షణమే స్పందించారు. “తప్పులు, అవినీతి బయటపెట్టడమే మా లక్ష్యం. అరెస్టులకోసం రాజకీయం చేయడం కాదు, అంటూ బండి వ్యాఖ్యల్ని ఖండించారు. ఇలాంటివే మాట్లాడుతూ ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారు? అంటూ […]

వైసీపీకి వైఎస్సార్‌కు ఏం సంబంధం?… వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.కూటమి ప్రభుత్వానికి వైసీపీపై కోపం ఉంటే, దానిని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల మీద చూపిస్తారా? అని ప్రశ్నించారు. అసలు వైసీపీకి వైఎస్సార్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. నందిగామ గాంధీ సెంటర్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడంపై షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించిన చోటే తిరిగి ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.

డ్రైవర్ రాయుడు హత్య కేసు… వినుత కోటకు బెయిల్

శ్రీకాళహస్తికి చెందిన రాజకీయ నాయకురాలు, జనసేన బహిష్కృత నేత వినుత కోటకు బెయిల్ మంజూరు అయింది. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన రాయుడు హత్య కేసులో వినుత కోట ఏ3గా ఉన్నారు. ఈ కేసులో వినుత కోటకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ ఇటీవల మంజూరు చేసింది. అయితే ప్రతిరోజు ఉదయం 10 గంటలలోపు సీ3 సెవెన్ వెల్స్ పోలీసు స్టేషన్‌లో సంతకం చేయాలని షరతు విధించింది.

కాళేశ్వరం కమిషన్ నివేదిక.. సచివాలయానికి వెళ్లిన హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు కోరారు. శుక్రవారం ఆయన సచివాలయానికి వెళ్లి సిఎస్ రామకృష్ణరావును కలిశారు. జస్టిస్ ఘోష్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను ఇవ్వాలని కోరుతూ.. కెసిఆర్, హరీష్ రావు పేరుతో వేర్వేరు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం వినతిపత్రాలు ఇచ్చినట్లు రశీదులు తీసుకున్నారు. హరీశ్‌రావు విజ్ఞప్తిని పరిశీలించి చెబుతామని […]

రాహుల్ గాంధీ ప్రమాణం చేసి ఫిర్యాదు చేయాలి- ఈసీ

లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓట్ల దొంగతనం’ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా స్పందించింది. రాహుల్ ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ, తన ఆరోపణలు నిజమని నమ్మకం ఉంటే ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఈసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఫ్యాక్ట్ చెక్’ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని ఈసీఐ రాహుల్‌కు హితవు పలికింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON