లోక్సభ ఎన్నికల్లో ‘ఓట్ల దొంగతనం’ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా స్పందించింది. రాహుల్ ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ, తన ఆరోపణలు నిజమని నమ్మకం ఉంటే ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఈసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఫ్యాక్ట్ చెక్’ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని ఈసీఐ రాహుల్కు హితవు పలికింది.

