శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు అవతరించిన పవిత్ర దినం ఇదని అన్నారు. ఆయన చూపిన నీతి మార్గంలో నడుస్తూ, ప్రతి ఒక్కరూ తమ జీవితాలను ఆనందం, సంతోషాలతో నింపుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.

