ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి నూజివీడు వెళ్లే రహదారి అభివృద్ధి పనుల టెండర్లను 48 గంటల్లో పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. 48 గంటలు డెడ్లైన్ విధించారు.. లేకపోతే ధర్నాకు కూర్చుంటాను అంటూ హెచ్చరించారు. రహదారి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, రోడ్లు భవనాలశాఖకు చెందిన అధికారి టెండర్లు పిలవకుండా ఆలస్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

