loader

కవిత కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు – తీన్మార్ మల్లన్న

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేతులు కలిపి, కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితికి మాజీ ఎమ్మెల్సీ కవిత వచ్చారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడగా, రాహుల్ గాంధీ అడ్డు చెప్పారని ఆయన తెలిపారు. కవిత పార్టీ మారే విషయం తెలిసి కేసీఆర్ ఆమెను పక్కకు పెట్టారని మల్లన్న ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

మంటపెట్టిన పవన్ కళ్యా్ణ్ ఫ్లెక్సీ..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పి. గన్నవరంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కోనసీమను కళ్యాణ్ సీమ అంటూ ఉన్న ఫ్లెక్సీలను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. అంతేగాక వాటిపై మీరెంత‌.. మీ స్థాయి ఎంత‌.. రోడ్ల మీద పండేస్తాం.. కొడ‌కల్లారా అంటూ వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో దళిత సంఘాలు ఆగ్రహిస్తూ.. వాటిని చించేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులపై మండిపడ్డారు.

బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ..

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై సుధీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ పార్టీ నేతలతో మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్‌‌ తరువాత పార్టీ తీసుకోవాల్సీన చర్యలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

అందుకే కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారు.. సత్యవతి రాథోడ్

కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీడియా ముందుకు వచ్చింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించారు కాబట్టే కవితను హైకమాండ్ సస్పెండ్ చేసినట్లు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి సత్యవతి రాథోడ్.. కవిత సస్పెన్షన్ గురించి స్పందించారు. పేగు బంధం కంటే.. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కోట్ల మంది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టం చేశారు.

కవితకు భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్..

ఎమ్మెల్సీ కవితకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇటీవల కవిత ప్రవర్తన పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నందున పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.నిన్న కవిత విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పార్టీ ముఖ్య నేత అయిన హరీష్ రావుపై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో పేర్ని నాని ములాఖత్

రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో వైసీపీ కీలక నేత పేర్ని నాని ఇవాళ (మంగళవారం) ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో పేర్నినాని మాట్లాడారు. ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని.. ఇవాళ ఆయనను పరామర్శించానని చెప్పుకొచ్చారు. మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసి 40 రోజులు అయ్యిందని, ఒక్క రోజు కూడా కస్టడీకి ఎందుకు తీసుకోలేదని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబాన్ని మానసింగా కుంగదీసేందుకే అరెస్ట్ చేశారని […]

హరికృష్ణ నటుడిగా, నాయకుడిగా అసమాన ప్రతిభ చూపారు: సీఎం చంద్రబాబు

చైతన్య రథసారథి, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘననివాళి అర్పించారు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన శైలి ఆయనకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నందమూరి హరికృష్ణ తరతరాలకు గుర్తుండిపోయే నాయకుడు. సినిమా నటుడుగానూ ఆయన చూపిన అసమాన ప్రతిభ చిరస్మరణీయం. ఈ సందర్భంగా హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్నా’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కవిత బహిష్కరణ

బీఆర్ఎస్ (BRS) సంచలన నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవితను బహిష్కరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ హై కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.

పోలీసులపై కాల్పులు జరిపి, పారిపోయిన ఆప్ ఎమ్మెల్యే హర్మీత్

ఒక మహిళపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నారు. పోలీసులపై కాల్పులు జరిపిన తర్వాత హర్మీత్ తప్పించుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అత్యాచారం ఆరోపణలతో హర్యానాలోని కర్నాల్ నుంచి ఆప్ ఎమ్మెల్యేను మంగళవారం (సెప్టెంబర్ 2)న అరెస్టు చేశారు. పోలీసులు హర్మీత్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా, అతను, అతని సహచరులు పోలీసులపై కాల్పులు జరిపారు. హర్మీత్ పోలీసులను ఢీకొట్టి పారిపోయాడు. […]

కాళేశ్వరం కేసు.. ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలొద్దు: ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON