ఒక మహిళపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నారు. పోలీసులపై కాల్పులు జరిపిన తర్వాత హర్మీత్ తప్పించుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అత్యాచారం ఆరోపణలతో హర్యానాలోని కర్నాల్ నుంచి ఆప్ ఎమ్మెల్యేను మంగళవారం (సెప్టెంబర్ 2)న అరెస్టు చేశారు. పోలీసులు హర్మీత్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా, అతను, అతని సహచరులు పోలీసులపై కాల్పులు జరిపారు. హర్మీత్ పోలీసులను ఢీకొట్టి పారిపోయాడు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డాడు.

