loader

ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌కు బెదిరింపులు.. ఫ్యామిలీతో సహా చంపేస్తామని వార్నింగ్ లెటర్

ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. మంత్రితో పాటు ఆయన కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామని మావోయిస్టుల పేరిట ఓ లేఖ వచ్చింది. ఏకంగా ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో ఉన్న మంత్రి పేషీకి ఈ లేఖ రావడం కలకలం సృష్టించింది. మావోయిస్టుల బెదిరింపు లేఖపై మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపు లేఖపై […]

బిఆర్‌ఎస్ ఇప్పటికీ మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తుంది: మంత్రి పొంగులేటి

ఒక ప్రక్క ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతున్నప్పటికి బి ఆర్ ఎస్ పార్టీ నేతలు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, వాళ్ళ వద్ద ఇంకా ట్యాపింగ్ పరికరాలు ఉన్నట్లు అనుమానం కలుగుతుందని  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరుగుతోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు.. ఇది అక్షరాలా నిజం. అసలు తాను ఉద్యోగులతో చేసిన సంభాషణకు సంబంధించిన ‘వాయిస్ కాల్ రికార్డ్’ బీఆర్‌ఎస్ నాయకులకు ఎలా […]

డికెకు మద్దతుగా 90మంది ఎంఎల్‌ఎల లేఖ!

కర్నాటకలో ముఖ్యమంత్రి పదవిలో డిప్యూటీ సిఎం శివకుమార్‌ను నియమించాలని కోరుతూ 80 మంది ఎంఎల్‌ఎలు హైకమాండ్‌కు లేఖ రాసినట్లు సమాచారం. ‘అవును. నిజమే 80 నుంచి 90 మంది శాసనసభ్యులం డికెకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాశాం. ఇక సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పలుమార్లు చేస్తున్న ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఏది ఏమైనా మేం క్రమశిక్షణగా మెలగాల్సిన అవసరం ఉంది. అధిష్టానం ఏం చెబితే దాన్ని పాటించాల్సి ఉంటుంది’ అని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఇక్బాల్ […]

లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం.. అప్పటి వరకూ సభకు దూరం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం (No confidence Motion)పై చర్చ పూర్తయ్యేంత వరకూ సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీకి కాంగ్రెస్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీకి స్పీకర్ అవకాశం ఇవ్వలేదని, నిలదీసిన 8 మంది ఎంపీలపై సస్పెన్స్ వేటువేశారని విపక్షాలు తప్పుపడుతున్నాయి.

తెలంగాణలో రేపే మున్సిపల్ పోరు.. పోలింగ్‌కు సర్వం సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. రేపు (ఫిబ్రవరి 11) రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2,996 వార్డులకు గాను 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 52 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 26 లక్షలకు పైగా ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 […]

అసోంలో 2.4 లక్షల ఓట్లు తొలగింపు.. SIR అనంతరం కొత్త ఓటర్ల జాబితా విడుదల

అసోంలో 2.4 లక్షల ఓట్లను తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసోంలో ఎన్నికల సంఘం స్పెషల్ రివిజన్ (SIR) నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్ఆర్ నిర్వహించి తాజా జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,49,58,139 మంది ఓటర్లున్నారు.

గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌తో సీఎం చంద్రబాబు భేటీ

ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. PM-PRANAM పథకం కింద ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్‌ను విస్తరించడానికి నిధులు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.216 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు విన్నవించారు.

న‌ర‌వ‌ణే అబ‌ద్ధం చెబుతున్నారా?.. పెంగ్విన్ అబ‌ద్దం చెబుతుందా?

మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం న‌ర‌వ‌ణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ వివాదాస్ప‌ద‌మైంది. ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. తాను రాసిన పుస్త‌కం ఆన్‌లైన్‌లో దొరుకుతోంద‌ని, లింక్ ఓపెన్  చేస్తే విష‌యాలు తెలుస్తాయ‌ని త‌న ట్వీట్‌లో న‌ర‌వ‌ణే పేర్కొన్న‌ట్లు రాహుల్ వెల్ల‌డించారు. కానీ తాము ఆ బుక్‌ను ఇంకా రిలీజ్ చేయ‌లేద‌ని పెంగ్విన్ సంస్థ తాజాగా ప్ర‌క‌టించింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ..న‌ర‌వ‌ణే అబ‌ద్దం చెబుతున్నారా లేక పెంగ్విన్ […]

స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం

లోక్​సభ స్పీకర్ ఓంబిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ ఎంపీలు నోటీసులు అందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-C కింద అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసినట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌ తెలిపారు. కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ తదితర పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.

45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు ఇవ్వాల్సిందే!

తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారంలో ఉపయోగించే 63 అంశాలతో ప్రతిదానికో ధరను నిర్ణయించారు. వాటి సైజు, విస్తీర్ణం ప్రకారంగా రేట్లను నిర్ణయించారు. ఒక్కో అభ్యర్థి మున్సిపాలిటీలో రూ. లక్ష, కార్పొరేషన్లలో రూ.1.5 లక్షల్లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచినా, ఓడినా ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి 45 రోజుల్లో పూర్తిస్థాయిలో ఖర్చు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే గెలుపొందిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేస్తారు. ఓడిన అభ్యర్థులు  మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లోనైనా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON