loader

కాంగ్రెస్‌ విధానాలతో దేశానికి తీవ్రనష్టం: మోదీ

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ సంస్కరణలకు వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆ పార్టీ చేసేవన్నీ ప్రతికూల రాజకీయాలని మండిపడ్డారు. ‘‘జన్‌ధన్‌, డిజిటల్‌ పేమెంట్స్‌, జీఎస్టీ, ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దులను కూడా కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. ఏ సంస్కరణ వచ్చినా ఆ పార్టీ అడ్డుకుంటుంది.. దుష్ప్రచారం చేస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. హస్తం పార్టీ విధానాల వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతోంది’’ అని అన్నారు.

మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం – విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక

రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోయిన సందర్భంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ దేశంలోని ప్రతి పౌరుడు మహిళల పురోగతి ఎలా నిలిచిపోయిందో చూస్తున్నారు… మా శతవిధ ప్రయత్నాల పట్టికీ, మేము విజయం సాధించలేకపోయామని ఆయన తెలిపారు. నారీ శక్తి అధినియంలో సవరణలు చేయలేకపోయాము. దీనికి గాను దేశంలోని తల్లులందరికీ, సోదరీమణులందరికీ నేను క్షమాపణలు కోరుతున్నానని మోదీతెలిపారు.మహిళా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి పేరున్న ఐపీఎల్ టికెట్లు హీరోయిన్లకు.. సీఎంవోపై అనుమానాలు.

తెలంగాణ ముఖ్యమంత్రి పేరిట ఇచ్చే ఎలైట్ లాంజ్ టిక్కెట్లతో హీరోయిన్ కుషితా కల్లాపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు చూసేందుకు వెళ్తోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో సీఎం పేరు మీదున్న టిక్కెట్ ఫోటోలను పెట్టడంతో ఈ విషయం బయటపడింది. దాంతో, సీఎంవో టిక్కెట్లను హీరోయిన్లకు పంచుతున్నారా? లేదంటే బ్లాక్‌లో అమ్ముతున్నారా? అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలైట్ లాంజ్ టిక్కెట్ల విలువ రూ. 40,000లు ఉంటుంది. ఇంత ఖరీదైన టికెట్లను ఉచితంగా హీరోయిన్లకు పంచుతున్నది ఎవరు? […]

పంచాయతీ కార్యాలయం ముందు మహిళా సర్పంచ్ నిరసన

మెదక్ జిల్లా  పెద్ద శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు మహిళా సర్పంచ్ జంగం రేణుక శ్రీనివాస్ శనివారం నాడు నిరసనకు దిగారు. తనను ఉపసర్పంచ్ రాజుగౌడ్ పదేపదే అవమానిస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. మహిళగా తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంగంరేణుక శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామపంచాయతీకి తెలియకుండా ప్రతి వీధిలో తనకు నచ్చిన వ్యక్తులకు పంచాయతీ నల్ల కలెక్షన్లు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.

చేసిన తప్పులకు విపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదు: మోదీ

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలపై కోయంబత్తూర్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. మహిళల కోసం చేసిన మంచి ప్రయత్నాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని, చేసిన తప్పులకు విపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మహిళల అభ్యున్నతి కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బిల్లును అడ్డుకున్నందుకు డీఎమ్‌కే నేతలను ప్రజలు ప్రశ్నించాలన్నారు. సామాన్య మహిళలను ఎంపీ, ఎమ్మెల్యేలను చేయడమే తన సంకల్పమన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు క్రెడిట్‌ను విపక్షాలే తీసుకోవాలని కోరానని చెప్పారు.

పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత – అత్యవసర ఆపరేషన్ చేసిన వైద్యులు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్‌ అస్వస్థకు గురి కావడం తో శనివారం సాయంత్రం  ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర సర్జరీ నిర్వహించారు.  వైద్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన ఎంఆర్ఐ  స్కాన్ రిపోర్టులను విశ్లేషించిన డాక్టర్ల బృందం, జాప్యం చేయకుండా ఆపరేషన్ చేయాలని నిర్ణయించింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందని,  ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే, అసలు ఆరోగ్య సమస్య ఏమిటన్నది మాత్రం ఆయన వ్యక్తిగత బృందం గానీ, ఆసుపత్రి […]

6,6,6,6,4,4,4,4,4.. అభిషేక్ శర్మ విశ్వరూపం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

సొంతగడ్డపై హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు  అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎడాపెడా బౌండరీలు, భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 15 బంతుల్లోనే అద్భుతమైన అర్ధ శతకం సాధించి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా అందరినీ దారుణంగా శిక్షించాడు. బంతి పడటమే ఆలస్యం   అన్నట్లుగా కళ్లు చెదిరే కట్ షాట్లు, కవర్ డ్రైవ్ లు, […]

ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటనకు జీవో జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా ఏడుగురు మంత్రుల బృందం (కొన్ని నివేదికల ప్రకారం తొమ్మిది మంది) ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ బృందంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర ప్రణాళికా విభాగం ఈ పర్యటనకు అయ్యే ఖర్చును […]

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కాల్పులు: వెనక్కి మళ్లిన రెండు భారత నౌకలు

అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) బలగాలు ఒక ఆయిల్ ట్యాంకర్‌పై కాల్పులు జరపడంతో సముద్ర మార్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ పరిణామంతో రెండు భారత జెండా కలిగిన నౌకలు సహా సుమారు 10 వాణిజ్య నౌకలు తమ ప్రయాణాన్ని ఆపేసి వెనక్కి మళ్లాయి. ఈ ఘటన ఒమన్‌కు 20 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం చోటుచేసుకున్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) ధృవీకరించింది.

యూపీఎస్సీ.. తొలిసారి రాత పరీక్షల ఆన్సర్‌ కీలు విడుదల! సివిల్స్‌లోనూ ఇదే తరహా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమి, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I) 2026కు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీలను యూపీఎస్సీ విడుదల చేసింది. గతంలో తుది ఫలితాల విడుదల తర్వాత మాత్రమే ఆన్సర్‌ కీలను యూపీఎస్సీ విడుదల చేసేది. అయితే పారదర్శకత కోసం ఈ ఏడాది నుంచి పరీక్ష జరిగిన కొద్ది రోజుల్లోనే ఆన్సర్‌ కీలను అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉంటే  ఏప్రిల్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON