loader

కొండపైనుంచి బస్సు బోల్తా.. 15 మంది మృతి!

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి కొండపై నుంచి దొర్లుతూ కిందకు పడిపోయిన ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ బస్సు ఓ మారుమూల గ్రామం నుంచి ఉధంపుర్‌కు వెళ్తుండగా.. కాగోర్ట్ గ్రామ సమీపంలోని కొండ మార్గంలో మలుపు దాటుతుండగా ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు.

చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ – మామయ్య గారు అంటూ…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్… ఏపీ సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ‘ఏపీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు మామయ్య గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని… అదే అంకిత భావంతో దార్శనికతతో మన ప్రజలకు నాయకత్వం వహించి, సేవ చేసే శక్తిని పొందాలని ఆకాంక్షిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి, సుసంపన్నత, ఆత్మగౌరవంతో మీ నాయకత్వం కొనసాగాలని… నిరంతరం స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.

యువతి ప్రాణం తీసిన సెల్ ఫోన్ పిచ్చి

అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు మితాజెన్-అజయ్ కుమార్‌లు రాజంపేటలో నివసిస్తున్నారు. మితాజెన్ చెల్లెలు కూడా ఈ దంపతులతో కలిసి ఉంటుంది.చెల్లెలు సెల్‌ఫోన్ ఎక్కువ వీక్షిస్తుండడంతో పలుమార్లు మందలించారు. సెల్‌ఫోన్ మాయ నుంచి ఆమె బయటకు రాకపోవడంతో ఫోన్‌ను అక్కాబావ పగులగొట్టారు. యువతి మానస్థాపానికి గురై రూమ్‌లో ఉరి వేసుకుంది. వెంటనే దంపతులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆప్తమిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు: మోదీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కష్టపడి పనిచేసే ఏపీ సీఎం, ఆప్తమిత్రుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఆయనకు దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం లభించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

నారా చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు (1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా  (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసారు. 2004 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

అమెరికాలోని లూసియానాలో ఓ రద్దీ ప్రదేశంలో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పిల్లలు మృతి చెందారు. మృతుల వయసు ఒకటి నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని ప్రీప్పాట్ అధికారులు వెల్లడించారు. దాడుల అనంతరం నిందితుడు ఓ కారును తస్కరించి పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంబడించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాల్పులు జరపగా నిందితుడు చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాల్పులకు గురైన వారిలో కొందరు నిందితుడికి బంధువులని పోలీసులు భావిస్తున్నారు.

చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల సందర్భంగా మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన ‘కామన్ డిస్‌ప్లే పిక్చర్’ (CDP) ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రతిబింబించేలా ఈ సీడీపీని రూపొందించడం విశేషం. మంత్రి లోకేష్ విడుదల చేసిన సీడీపీని తమ ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

​తిరుమలలో భక్తురాలి అత్యుత్సాహం!..విజయ్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థన

తిరుమలలో ఓ భక్తురాలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండగా… నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ఓటు వేయాలని తిరుమల కొండపై నుంచి అభ్యర్థించారు. ‘‘వోట్ ఫర్ టీవీకే’’ అని కోరడమే కాకుండా… ఆ పార్టీ గుర్తు అయిన విజిల్ కూడా తన మెడలో వేసుకున్నారు. తిరుమల కొండపై ఇంత జరుగుతున్నా టీటీడీ సిబ్బంది ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నించారు. వాటిని నియంత్రించేందుకు క్షేత్ర స్థాయిలో సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

నా ఉద్దేశ్యం అది కాదు..అలాంటి కంటెంట్ ఉండదు..అనన్య నాగళ్ల..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ప్రారంభించిన ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్‌పై కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేయడంతో, ఆమె ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.తాను సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో పోస్ట్ చేస్తున్నది కేవలం భక్తికి సంబంధించిన కంటెంట్ అని ఆమె స్పష్టం చేశారు. “నేను నా పర్సనల్ లైఫ్ విశేషాలతో పాటు, నాకు ఇష్టమైన ఆధ్యాత్మిక విషయాలను, దేవాలయాల సందర్శన వీడియోలను అక్కడ పంచుకుంటున్నాను. అందులో ఎలాంటి అశ్లీలత లేదు. కేవలం భక్తి కంటెంట్ మాత్రమే ఉంది” అని ఆమె […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON