loader

సినిమా లవర్స్‌కు గుడ్‌న్యూస్..టికెట్లు రేట్లు మరింత తగ్గనున్నాయి?

కొత్త జీఎస్టీ రేట్లు సినిమా టికెట్లపై కూడా ఈ మార్పు రానుంది. గతంలో 12% పన్ను విధించిన రూ.100 లేదా అంతకంటే తక్కువ ధర గల టిక్కెట్లు ఇప్పుడు 5% తక్కువ GST రేటుతో వర్తిస్తుంది. రూ.100 కంటే ఎక్కువ ధర గల టిక్కెట్లపై GST మునుపటిలాగే 18% ఉంటుంది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాన్ని రూ. 300 వరకు ధర ఉన్న సినిమా టిక్కెట్లను 5% స్లాబ్ కిందకు తీసుకురావాలని అభ్యర్థించింది.

పుట్టినరోజు సందర్భంగా ఓజీ కొత్త పోస్టర్ హిట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 56వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘ఓజీ’ (They Call Him OG) చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పోస్టర్‌లో పవన్ కల్యాణ్ ముంబైలోని తాజ్ హోటల్ ముందు వింటేజ్ ‘డాడ్జ్’ కారుపై కూర్చుని స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

హరికృష్ణ 69వ జయంతికి ఎన్టీఆర్ భావోద్వేగ నివాళి

తెలుగు సినిమా యువ కథానాయకుడు ఎన్టీఆర్ తన తండ్రి, దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. హరికృష్ణను స్మరించుకుంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు: “ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే.”

దీర్ఘాయుష్మాన్ భవ! – మెగాస్టార్ చిరంజీవి

చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ! – మెగాస్టార్ చిరంజీవి

‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ అందుకున్న బాలకృష్ణ..

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గోల్డ్‌ ఎడిషన్‌లో ఆయనకు చోటు కల్పించినట్లు ఇటీవలే ప్రకటించారు. 50 ఏళ్లకు పైగా సినిమాల్లో హీరోగా కొనసాగుతున్నందుకు గాను ఆయనకు ఈ పురస్కారం వరించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి హీరోగా బాలయ్య నిలిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్ లో బాలయ్య ఈ అవార్డును అందుకున్నారు.

వరద బాధితులకు బాలకృష్ణ భారీ విరాళం

టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన మంచి మనసు చాటుకున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి ముందుకొచ్చారు. కామారెడ్డిలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురష్కారాన్ని అందుకున్న బాలయ్య.. ఈ సందర్భంగా ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.

అల్లు నివాసంలో బన్నీతో రామ్ చరణ్, చిరంజీవి..

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ గారు కన్నుమూశారు. అల్లుడు చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి అల్లు నివాసానికి వచ్చారు. షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న అల్లు అర్జున్, మైసూర్ లో ఉన్న రామ్ చరణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీలు ఒకచోట కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నాన‌మ్మ మృతి.. అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్

ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ నానమ్మ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్, ముంబైలో తన సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, వెంటనే హైదరాబాద్‌కు వ‌చ్చారు. ప్ర‌స్తుతం అల్లు అర‌వింద్ ఇంటికి అల్లు అర్జున్ చేరుకున్నారు

ఆదోని నుంచి సైకిల్‌పై హైదరాబాద్‌కు.. మెగాస్టార్‌ను కలిసిన అభిమాని..

ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి, రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆ సందర్భంలో రాజేశ్వరి, మెగాస్టార్‌కి రాఖీ కట్టగా, ఆమెకు ఆశీస్సులు అందించి అందమైన సాంప్రదాయ చీరను బహుమతిగా ఇచ్చారు. రాజేశ్వరి పిల్లల విద్య కోసం, వారి భవిష్యత్ లో వెలుగునింపడం కోసం పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు చిరు.

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విశాల్ – సాయి ధన్సిక…

కోలీవుడ్ నటుడు విశాల్, ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 47 ఏళ్ల వయసులో ప్రేయసి సాయి ధన్సికతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు విశాల్. వధూవరుల కుటుంబాలతో పాటు అతికొద్ది మంది ఆత్మీయ అతిథుల మధ్య సాయి ధన్సిక, విశాల్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ‘నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషెస్ తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు సాయి ధన్సికతో నా ఎంగేజ్‌మెంట్, మా ఇరువురి కుటుంబసభ్యుల మధ్య జరిగిందనే శుభవార్త, మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. అంటూ ఎంగేజ్‌మెంట్ ఫోటోలను […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON