loader

షారుఖ్ ఖాన్ అరుదైన రికార్డ్, మెట్ గాలాలో ఫస్ట్ ఇండియన్ యాక్టర్

హాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ అయిన మెట్ గాలాలో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు పొందారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో జరిగిన రెడ్ కార్పెట్ పై నడకకు ముందు, న్యూయార్క్ నగరంలోని మాండరిన్ ఓరియంటల్ హోటల్ బయట తన అభిమానులను కలిశారు. అభిమానులతో కరచాలనం చేస్తూ ముద్దులు పెడుతున్న కింగ్ ఖాన్ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ ను మరింతగా వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోస్ […]

సినిమా ఇండ‌స్ట్రీపై ప‌డ్డ ట్రంప్‌.. వారిపై 100 శాతం టారిఫ్

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా “విదేశాల్లో నిర్మించిన” అన్ని సినిమాలపై 100% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ చిత్రాల ప్రవాహాన్ని ఇతర దేశాల కుట్ర గా అభివర్ణించిన ట్రంప్ దీన్ని జాతీయ భద్రతా ముప్పు గా పేర్కొన్నారు. ఈ విదేశీ ప్రోత్సాహకాలు అమెరికా సినిమా పరిశ్రమను వేగంగా క్షీణింపజేస్తున్నాయని, గణనీయమైన ఆర్థిక నష్టాలకు కారణమవుతున్నాయని, దేశీయ చిత్రనిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయని వాదించారు.

పాకిస్తాన్ హీరోకి ప్రకాశ్ రాజ్ మద్దతు, మండిపడుతున్న నెటిజన్లు

పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబిర్ గులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పు పట్టారు. ఏ సినిమాను ఇలా నిషేదించడం కరెక్ట్ కాదు అన్నారు ప్రకాశ్ రాజ్. పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అనేది సినిమా రిలీజ్ తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారని, రిలీజ్ చేసి ఫలితాన్ని వారికే వదిలేయాలని ఆయన అన్నారు. ప్రకాశ్ రాజ్ స్పందనపై విమర్శలు వస్తున్నాయి. చాలామంది నెటిజన్లు ప్రకాశ్ రాజ్ ను విమర్శిస్తుండగా.. కొంత […]

కొందరు నటులు రాజకీయాల్లోకి వచ్చి అడ్రస్ లేకుండా పోయారు, నేను హ్యాట్రిక్ కొట్టాను

నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారం వరించిన సందర్భాన్ని పురస్కరించుకుని హిందూపురం ప్రజలు ఆయనకు పౌర సన్మానం చేశారు. 50 ఏళ్లు హీరోగా ప్రపంచంలో ఎవరూ చేయలేదు. అన్నేళ్లు నటించినా, మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు. మీ ఆశీర్వాదంతోనే ఇది సాధ్యం. కొందరు నటులు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ అడ్రస్ లేకుండా పోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలో, పాలిటిక్స్ లోకి వచ్చి ప్రజలకు సేవ చేశారని గుర్తుచేసుకున్నారు.

అందాల పోటీల సందడి షురూ.. భాగ్యనగరానికి చేరుకుంటున్న అందగత్తెలు..

తెలంగాణలో అందాల పోటీల హడావుడి ప్రారంభమైంది పలు దేశాల అందగత్తెలు హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధమైంది. వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు కెనడా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మిస్‌ కెనడా క్యాథరన్‌ మోరిసన్‌కు ఘనస్వాగతం లభించింది. యువతులు సంప్రదాయ నృత్యాలు చేస్తుండగా తెలంగాణ సంప్రదాయం ప్రకారం హారతి పట్టి, నుదుట బొట్టుపెట్టి, మెడలో పూలమాల […]

AA 22 కోసం రంగంలోకి లాయిడ్.. బన్నీ లుక్ ఛేంజ్

AA22 అల్లు అర్జున్, అట్లీ సినిమాకు సంబంధించిన పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.  అట్లీ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ప్రాజెక్ట్‌కి తగ్గట్టుగా బన్నీ తన బాడీని మార్చుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్‌ను లాయిడ్‌ ట్రైన్ చేశాడు. మళ్లీ ఇప్పుడు బన్నీ కోసం లాయిడ్ వచ్చాడు. అసలే అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ఇంటర్నేషన్ లెవెల్లో ఉండబోతోంది. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో కలిసి ఈ మూవీ కోసం పని చేయబోతోన్నారు.

విజయ్ దేవరకొండ సినిమాని AI తో వర్క్ చేయిస్తున్నాం: దిల్ రాజు

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ‘లార్వెన్‌ ఏఐ’ పేరుతో సరికొత్త స్టూడియోను ప్రారంభించారు. శనివారం తెలంగాణ మంత్రి శ్రీధర్‌ బాబు చేతుల మీదుగా ఈ స్టూడియోని లాంచ్ చేసారు. ప్రీ ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్రమోషన్స్‌.. ఇలా సినిమా నిర్మాణంలో ఏఐ భాగం కానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్ధన్’ సినిమా పనులను ఏఐ స్టూడియోలోనే చేస్తున్నట్లు దిల్ రాజు చెప్పారు.

అవ్‌నీత్ కౌర్‌ హాట్ ఫోటోకి లైక్ కొట్టిన విరాట్ కోహ్లీ!

‘నా ఫీడ్ క్లియర్ చేస్తుంటే పొరపాటున లైక్ పడ్డట్టుగా ఉంది. నేను, ఇది కావాలని చేసింది కాదు. కాబట్టి మీరంతా అనవసరంగా కథలు అల్లేయొద్దని వేడుకుంటున్నా… అర్థం చేసుకున్నందుకు థ్యాంక్యూ..’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ.. విరాట్ కోహ్లీ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్లారిటీ ఇస్తూ చేసిన పోస్ట్.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏం జరిగింది? ఎందుకు పోస్ట్ పెట్టాడనేది చాలా మందికి అర్థం కాలేదు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే విరాట్ […]

నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా

తెల్లటి టీషర్టుపై .. పోలీస్ రికార్డుల్లో ఉండే ఫొటోలు ఉన్నాయి. వాటి కింద ‘ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అని అక్షరాలు కూడా ఉన్నాయి. కాస్ట్‌లీ బ్రాండ్ల టీషర్టులు వాడి బోర్ కొట్టినట్లు ఉంది. అందుకే కొత్త ట్రై చేశారు. అది కాస్తా ట్రెండ్‌గా మారబోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ టీషర్టు వేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

హైదరాబాద్‌కు వచ్చిన మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లి

మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి హైదరాబాద్ కు చేరుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం జరుగుతున్న ఏర్పాట్లతో పాటు, మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించే పలు ప్రాంతాల లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, పలు విభాగాల అధికారులు, ప్రతినిధులతో సమీక్షించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON