loader

తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి.ఆదివారం ఉదయం 6 గంటలకు బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరిచిన అనంతరం ఆలయాన్ని దాదాపు 40 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా భారత సైన్యం గర్హ్వాల్ రైఫిల్స్ బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకుంది. చార్ ధామ్ యాత్ర 2025 ఏప్రిల్ 30న ప్రారంభమైంది. వేద మంత్రోచ్ఛారణలు, ఆచారాల మధ్య అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ధామ్ తలుపులు తెరుచుకోగా.. మే 2న కేదార్‌నాథ్ తలుపులు తెరుచుకున్నాయి.

పాక్ యువతిని రహస్యంగా పెళ్లాడిన సీఆర్పీఎఫ్ జవాన్

జమ్మూలోని ఘరోటా ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మద్.. 2017లో సీఆర్పీఎఫ్‌లో చేరారు. అయితే, 2024 మే 24న పాకిస్థాన్‌కు చెందిన యువతి మినాల్ ఖాన్‌తో వీడియో కాల్‌ ద్వారా ఆన్‌లైన్‌ నిఖా చేసుకున్నాడు. ఈ వివాహానికి సీఆర్‌పీఎఫ్ ప్రధాన కార్యాలయం నుంచి 2024 ఏప్రిల్ 30న అనుమతి వచ్చిందని మునీర్ వెల్లడించారు. సీఆర్పీఎఫ్ ప్రకారం.. మునీర్ తన వివాహాన్ని గోప్యంగా ఉంచడమే కాకుండా.. వీసా గడువు ముగిసిన తర్వాత ఆమెకు ఆశ్రయం కల్పించడం జాతీయ భద్రతకు హానికరమని […]

AA 22 కోసం రంగంలోకి లాయిడ్.. బన్నీ లుక్ ఛేంజ్

AA22 అల్లు అర్జున్, అట్లీ సినిమాకు సంబంధించిన పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.  అట్లీ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ప్రాజెక్ట్‌కి తగ్గట్టుగా బన్నీ తన బాడీని మార్చుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్‌ను లాయిడ్‌ ట్రైన్ చేశాడు. మళ్లీ ఇప్పుడు బన్నీ కోసం లాయిడ్ వచ్చాడు. అసలే అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ఇంటర్నేషన్ లెవెల్లో ఉండబోతోంది. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో కలిసి ఈ మూవీ కోసం పని చేయబోతోన్నారు.

యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు..

యూట్యూబర్ అన్వేష్‌పై సైబరాబాద్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారులపై బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ. 300 కోట్లు కొట్టేశారని తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులు తెలిపారు. ఆయన తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో. ఆ వీడియోలో అన్వేష్, తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్ రాజు వంటి ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు […]

విజయ్ దేవరకొండ సినిమాని AI తో వర్క్ చేయిస్తున్నాం: దిల్ రాజు

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ‘లార్వెన్‌ ఏఐ’ పేరుతో సరికొత్త స్టూడియోను ప్రారంభించారు. శనివారం తెలంగాణ మంత్రి శ్రీధర్‌ బాబు చేతుల మీదుగా ఈ స్టూడియోని లాంచ్ చేసారు. ప్రీ ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్రమోషన్స్‌.. ఇలా సినిమా నిర్మాణంలో ఏఐ భాగం కానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్ధన్’ సినిమా పనులను ఏఐ స్టూడియోలోనే చేస్తున్నట్లు దిల్ రాజు చెప్పారు.

ప్రజల సహకారమే విజయ రహస్యమ‌న్న సీఎం చంద్రబాబు

అమ‌రావ‌తి రీలాంచ్ స‌భ స‌క్సెస్ అయింద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వెల్ల‌డించారు. తాజాగా ఆయ‌న టెలీకాన్ఫరెన్స్ ద్వారా కూట‌మి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో స‌మావేశ‌మ‌య్యారు. అమ‌రావ‌తి రీలాంచ్ కు విజయానికి ప్రధాన కారణం ప్రజల భాగస్వామ్యమ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే వేదికపై ఉత్సాహంగా పాల్గొనడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల కృషిని కొనియాడారు. బాధ్యతగా వ్యవహరించి బ్రహ్మాండంగా పని చేశార‌న్నారు.

అవ్‌నీత్ కౌర్‌ హాట్ ఫోటోకి లైక్ కొట్టిన విరాట్ కోహ్లీ!

‘నా ఫీడ్ క్లియర్ చేస్తుంటే పొరపాటున లైక్ పడ్డట్టుగా ఉంది. నేను, ఇది కావాలని చేసింది కాదు. కాబట్టి మీరంతా అనవసరంగా కథలు అల్లేయొద్దని వేడుకుంటున్నా… అర్థం చేసుకున్నందుకు థ్యాంక్యూ..’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ.. విరాట్ కోహ్లీ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్లారిటీ ఇస్తూ చేసిన పోస్ట్.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏం జరిగింది? ఎందుకు పోస్ట్ పెట్టాడనేది చాలా మందికి అర్థం కాలేదు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే విరాట్ […]

నేనే నెంబరు 1 పోప్… ట్రంప్ నయా అవతార్

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వింత చేష్టకు దిగారు. ట్రంపోప్ అనే శీర్షికతో ఓ ఫోటోను సామాజిక మాధ్యమంలో ప్రవేశపెట్టారు. పోప్ వేషధారణతో ఉన్న తన ఫోటోను కృత్రిమ మేధ (ఎఐ) ద్వారా రూపొందేలా చేసి తనకు తానే మరో పోప్ అని ప్రకటించుకుంటూ చిల్లర చమత్కారానికి దిగారు. ట్రంప్ పోప్ అవతారం ఫోటోను అధికారికంగానే వైట్‌హౌస్ తమ సామాజిక మాధ్యమం ద్వారానే వెలువరించింది.

దేశంలో ఏకైక ప్రైవేట్ రైల్వే స్టేషన్..

భారతదేశంలో ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంది. ఈ రైల్వే స్టేషన్ పేరు రాణి కమలాపతి. గతంలో దీనిని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ అని పిలిచేవారు. అతిపెద్ద పార్కింగ్ స్టేషన్,ఎయిర్ కండిషన్డ్ గదులు, ఆఫీసులు, దుకాణాలు, హై స్పీడ్ ఎస్కలేటర్, లిఫ్ట్, కన్వెన్షన్ సెంటర్, హోటల్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వంటి ఉంటాయి. ఈ స్టేషన్ నిర్వహణను ప్రైవేట్ కంపెనీ చూసుకుంటుంది, కానీ అది భారత […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON