loader

మెగాస్టార్ చిరంజీవి కి అరుదైన గౌరవం

హౌస్ ఆఫ్ కామ‌న్స్ – యు.కె పార్ల‌మెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కి  గౌరవ స‌త్కారం జరగనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, యుకె కి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19న స‌న్మానించ‌నున్నారు.బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా, ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.

హింసకి వ్యతిరేకంగా తీసిన సినిమా ‘23’

మల్లేశం, 8 ఏ.ఎం, మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘23’తో వస్తున్నారు. 1991 సుండూరు ఊచకోత, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీహిల్స్ కార్ బాంబు పేలుడు.. ఈ మూడు సామూహిక హత్యల నేపధ్యంలో 23 టీజర్ ఆద్యంతం అద్భుతంగా కొనసాగింది.  ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది.

ఓటీటీలోకి వచ్చేసిన నాగచైతన్య ‘తండేల్’…

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘తండేల్’ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మూవీ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు, ఒకేరోజు 20 సినిమాలు పలు ఓటీటీ ప్లాట్ ఫాంల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అందులో 4 తెలుగు సినిమాలు ఉన్నాయి.శర్వానంద్ ‘మనమే’, విశ్వక్ సేన్ ‘లైలా’,

పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త… సూసైట్ అటెంప్ట్ కేసులో

గాయని కల్పనా రాఘవేందర్ ఆత్మహత్యకు పాల్పడిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఆమె భర్త ప్రభాకర్ ను అదుపులోకి తీసుకొని ఆయనను ఇంటికి తీసుకు వెళ్లి విచారణ చేపట్టారు.రెండు రోజులుగా తాను ఇంటిలో లేనని, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లినట్లు పోలీసులకు కల్పన భర్త ప్రభాకర్ తెలిపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం అందుతోంది. చెన్నై ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం పని ఉంది? ప్రభాకర్ చెప్పిన సమాధానాలు నిజమా? కాదా? అనేది వెరిఫై చేయనున్నారు.

రష్మికపై కన్నడిగుల కోపానికి కారణమేంటి?

బెంగళూరు లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి పలు వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగ నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై పరుష పదజాలంతో విరుచుకుపడడం తో పాటు కొన్ని సంచలన ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి రష్మిక రావడానికి నిరాకరించిందన్నది అవాస్తవం. కర్ణాటక గురించి ఆమె అగౌరవంగా మాట్లాడిందన్నది కూడా పూర్తిగా అబద్ధం, అని రష్మిక మందన్న టీమ్ స్పందించినట్లు […]

ఆస్కార్ 2025 విజేతలు

| ఉత్తమ చిత్రం : అనోరా | ఉత్తమ నటుడు : అడ్రిన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్) | ఉత్తమ నటి : మైకీ మ్యాడిసన్ (అనోరా) | ఉత్తమ దర్శకుడు : సీన్ బీకర్ (అనోరా) | ఉత్తమ సినిమాటోగ్రఫీ : లాల్ క్రావ్లీ (ది బ్రూటలిస్ట్) | ఉత్తమ సహాయ నటుడు : కీరన్ కల్కిన్ ( ఏ రియల్ పెయిన్) | ఉత్తమ సహాయనటి : జో సాల్దానా (ఎమిలియా పెరెజ్) | […]

ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతికి వస్తున్నాం..

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.  సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని ఈరోజు (మార్చి 1) సాయంత్రం నుంచి ‘జీ 5’ ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెట్టారు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో ‘జీ తెలుగు’ టెలివిజన్ ఛానల్ లోనూ టెలికాస్ట్ చేసారు

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు

సినీ నటుడు, దర్శకుడు, ఏపీఎఫ్‌టీవీడీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణ మురళీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలో పోసాని కృష్ణమురళిని సంబేపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్ నుంచి పోసాని కృష్ణమురళిని రాజంపేట తీసుకెళ్లారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో నమోదు అయిన కేసు. ఓబులావారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణమురళి పై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు అయింది. ఈ కేసులో పోసాని కృష్ణమురళీని […]

ఓటిటీలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక..

ఒక సినిమా పూర్తి అయిన తర్వాత విడుదల కావడానికి మధ్యలో సెన్సార్ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఈ మధ్య కాలంలో ఓ టి టి లోకి వచ్చే కంటెంట్లో మితిమీరిన శృంగారం , హార్రర్ , రక్తపాతం , ఆశ్లీల సంభాషణలు ఉండడం సర్వసాధారణంగా గమనిస్తున్నాం. ఇలాంటి వాటిని అడ్డుకోవడం కోసం తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఓ టి టి సంస్థలకు ఆదేశాలను ఇచ్చింది. మితి మీరిన రక్తపాతం , శృంగారం , జనాలను […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON