loader

ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్‌ ఉండాలి.. ‘ధురంధర్‌-2’పై జక్కన్న ప్రశంసలు

ధురంధర్-ది రివెంజ్ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు. తాజాగా  రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా దాదాపు 4 గంటల నిడివితో ఉంది. అదే విషయాన్ని ప్రస్తావించిన రాజమౌళి.. అంత సేపు సినిమా తీసి.. ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఉండేలా చేయడం అంటే మామూలు విషయం కాదని.. అందుకు ఎంతో గట్స్ ఉండాలని ప్రశంసించారు.  రచన, నటీనటులు, సాంకేతిక పరిజ్ఞానం, మ్యూజిక్ ఇలా వేటిలోనూ లోపాలు కనిపించలేదు అని […]

విజయ్ రాజకీయాలపై కమల్ హాసన్ కామెంట్స్… నెటిజన్ల విమర్శలు

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన క‌మ‌ల్ హాస‌న్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ పెరంబూర్ నుంచి పోటీ చేసే అవకాశాలపై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా, కమల్ హాసన్ నవ్వుతూ, “నాకెందుకు ఆ విషయం? నాకు చాలా పనులు ఉన్నాయి, వాటిపైనే దృష్టి పెట్టాలి” అని సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. కమల్ హాసన్ స్పందనపై అనేక […]

మణిరత్నం లవ్ స్టోరీలో సాయి పల్లవి..

ప్రేమకథా చిత్రాలకు సమకాలీన అంశాలని జోడించి వెండితెరపై అందమైన దృశ్యకావ్యాలుగా ఆవిష్కరించడంలో మణిరత్నం మాస్టర్ అన్నది తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మణిరత్నం రొమాంటిక్ లవ్ స్టోరీతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కథానాయికగా సాయి పల్లవి నటిస్తోంది. సాయి పల్లవి లాంటి సహజ నటితో తొలిసారి పని చేస్తున్న మణిరత్నం తనని ఎలా చూపిస్తాడు? అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.

చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం – చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. లిటిల్ క్యూట్ ఫ్యాన్‌ను ఇంటికి పిలిపించి చిన్నారికి నచ్చిన భోజనం వడ్డించారు. ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడారు. లడ్డూలు, పులిహోర వడ్డించి మరీ ముద్దుల వర్షం కురిపించారు. ఆ తర్వాత పాపను ఎత్తుకుని సరదాగా కబుర్లు చెప్పారు. విజయ్ పాపను ఎత్తుకుంటే రష్మిక ముద్దాడారు. ఇంటికెళ్లి డ్రెస్ మార్చుకుని బజ్జుంటా అని చిన్నారి క్యూట్‌గా చెప్పడంతో నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

‘ధురంధర్ 2’ ప్రశంసల వెనుక ఒత్తిడి రాజకీయాలు?.. టాలీవుడ్ న‌టుల‌పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!

‘ధురంధర్ 2’ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా టాలీవుడ్ టాప్ హీరోలు పోస్ట్‌లు పెట్టడంపై ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఎక్స్ వేదిక‌గా స్పందించాడు. ఉత్తరాదిలో తరచుగా వినిపించే “ఒత్తిడి రాజకీయాలు” ఇప్పుడు టాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించాయని, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే సినిమాలను ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి స్టార్ హీరోలకు వచ్చిందని ఆయన పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఈ సినిమాపై వ‌స్తున్న ప్ర‌శంస‌లు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

నంది ఇష్యూ… చిరు చెప్పింది తప్పా ఒప్పా

నిన్న హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ పక్క రాష్ట్రం, ఇతర తెలుగు రాష్ట్రం అంటూ ఆంధ్రప్రదేశ్ ని సంబోధిస్తూ అన్న మాటలు సోషల్ మీడియాలో చర్చకు, వివాదానికి దారి తీశాయి. సిఎం రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని అక్కడ కూడా నంది అవార్డులు ఇచ్చి, కళాకారులను గౌరవించే విధంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గారు చర్యలు తీసుకోవాలని చెప్పడం పలువురి ఆగ్రహానికి కారణమయ్యింది.ఏది ఏమైనా మెగాస్టార్ మాటలు ఇప్పుడు […]

ఉత్తమ నటుడిగా నాగ చైతన్య..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ ‘తండేల్’ సినిమాలో తన అద్భుత నటనకు గాను నాగ చైతన్యను జ్యూరీ ‘ఉత్తమ నటుడు’ (Best Actor) పురస్కారంతో తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ సత్కరించింది. నటుడిగా నాగ చైతన్య తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారని జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ప్రజా కళాకారుడు గద్దర్ స్మారకార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పురస్కారాన్ని అందుకోవడం చైతన్యకు దక్కిన అతిపెద్ద గౌరవం.

ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, దేశం బాగుపడుతుంది: చిరంజీవి

గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం దేశం బాగుపడుతుందని నానుడి.. ఆ నానుడి అర్ధం పరమార్థం గ్రహించి… రేవంత్‌ రెడ్డిగారు సినిమా ప్రభావాన్ని గుర్తించి మళ్లీ అవార్డుల వేడుకకు పునర్జీవం పోశారు. అందుకు రేవంత్‌ రెడ్డిగారికి కృతజ్ఞతలు. హాలీవుడ్ అంటే అగ్రరాజ్యం గుర్తొంస్తుంది. తెలంగాణ కూడా అలా ఎదగాలి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ సినిమాను ప్రోత్సహించాలి. ఆయన ఆలోచన చేయాలని […]

‘రాజు వెడ్స్ రాంబాయ్’ సినిమా.. ఉత్తమ దర్శకుడిగా సాయిలు కంపాటీ..!

తెలంగాణ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ తొలి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పురస్కారాల్లో పక్కా పల్లెటూరి కథాంశంతో, మట్టి వాసన ఉట్టిపడేలా తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్రం సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి ప్రాణం పోసి, ప్రతి సన్నివేశాన్ని అత్యంత సహజంగా మలిచిన దర్శకుడు సాయిలు కంపాటీని ‘ఉత్తమ దర్శకుడు’ పురస్కారంతో గౌరవించింది.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన ఆయన […]

8 వసంతాలు సినిమా.. స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్న అనంతిక..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుకల్లో అనంతిక సెంథిల్ కుమార్‌ అవార్డు గెలుచుకుంది. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, సినిమాల్లోని కళాత్మక విలువలను గుర్తించడంలో భాగంగా.. ‘8 వసంతాలు’ చిత్రంలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించిన యువ నటి అనంతిక సెంథిల్ కుమార్ కు ‘స్పెషల్ జ్యూరీ ఉత్తమ నటి’ అవార్డు లభించింది.అనంతికకు స్పెషల్ జ్యూరీ ఉత్తమ నటి అవార్డుతో పాటు గౌరవ సూచికగా వెండి జ్ఞాపికను అందజేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON