పిఠాపురంలోని ఆదర్శ స్కూల్‌కు చెందిన విద్యార్థులు మొత్తం 8 బస్సుల్లో విశాఖపట్నం పిక్నిక్కు వచ్చారు. పర్యటనలో భాగంగా కైలాసగిరిపైకి వెళ్లిన వీరిలో ఒక బస్సు కొండ దిగుతుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడి లోయలోకి జారిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఒక విద్యార్థికి కాలు విరగగా, మరో విద్యార్థి కంటికి గాయమైనట్లు సమాచారం. రిటైనింగ్ వాల్ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది