అమెరికాలో మరోసారి భారీ సైబర్ దాడి జరిగింది. ఎయిర్‌ఫోర్స్ క్లౌడ్ వన్‌లోకి హ్యాకర్లు చొరబడ్డారు. కీలక సైనిక కంప్యూటింగ్ వ్యవస్థలనే టార్గెట్ చేసి దాడి చేశారు. సాఫ్ట్ వేర్ లోపంతోనే హ్యాకర్లు చొరబడినట్లు గుర్తించారు. దీంతో నార్త్ అమెరికా ఎయిర్ డిఫెన్స్ రాడార్ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. హ్యాకర్లు, డేటా చోరీపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. యూఎస్ జాతీయ భద్రతపై అనుమానాలు కలిగిస్తోంది. ఏకంగా రక్షణ వ్యవస్థలోకి మాల్వేర్ లతో చొరబడిన హ్యాకర్లు కీలక డేటాను చోరీ చేసినట్లు తెలుస్తోంది.