ఎవరికైనా జీవితం ఒక్కటేనని, చెడు అలవాట్లకు బానిస కాకుండా ప్రతి ఒక్కరూ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని ‘నషా ముక్త్ భారత్’ ముగింపు కార్యక్రమంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి పిలుపునిచ్చారు. జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలంటే నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలి. మీ జీవితాన్ని కబళించే పెనుభూతంలా డ్రగ్స్ మారింది. ఎవరూ కావాలని డ్రగ్స్‌కు బానిసలు కారు. తెలియకుండా వ్యసనపరుడు అవుతాడు. మీ స్నేహితులు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే వారిని చీదరించుకోకండి. వారిని రిహాబిలిటేషన్ సెంటర్‌కు తీసుకెళ్లి మామూలు మనుషుల్లా చేసినప్పుడే స్నేహానికి విలువ అని చిరంజీవి అన్నారు.