కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కు ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేత అశుతోష్ రాంగా బిగ్ షాకిచ్చారు. ఆయనకు 3 కోట్ల రూపాయల పరువునష్టం నోటీసులు పంపారు. పాకిస్తాన్ నుంచి నిధులు అందుకున్నానంటూ తనపై చేసిన హేయమైన వ్యాఖ్యలకు గానూ..కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కు తాను ఈ మేరకు లీగల్ నోటీసు పంపినట్లు అశుతోష్ రాంకా ట్వీట్ చేశారు. ఈ అహంకారపూరిత, చదువులేని రాజకీయ నాయకుల పిల్లల్లా కాకుండా, తాను ఐఐటి కాన్పూర్ ప్రవేశం పొందడానికి చాలా కష్టపడ్డానన్నారు.