ఏపీ కేబినెట్ రుషికొండ భవనాల పైన అనూహ్య నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల పాటు ప్రజల సందర్శన కోసం రుషికొండ ప్యాలెస్‌ను తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. సందర్శనకు టికెట్ విధానంపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఆతిథ్య ప్రాజెక్ట్ కు PPP పద్ధతిలో అప్పగించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పైన టాటా, లీలా ప్యాలెస్, అట్మాస్ఫియర్ కోర్ వంటి 9 సంస్థలు ఆసక్తితో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.2019 CRZ నిబంధనల మేరకు మరో 4 ఎకరాల స్థలంలో కొత్త నిర్మాణాలకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

