ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, క్రియాశీల పాత్రతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్థలను మరింత బలోపేతం చేసే సంస్కరణలను ముందుకు తీసుకెళ్తోందని ప్రశంసించారు. 2051 వరకు ప్రస్తుత దామాషా ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూనే, అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదన దేశ ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని విస్తరించే కీలక అడుగు అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ కీలక జాతీయ సంస్కరణకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

