హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం ముంచెత్తింది. ఇస్నాపూర్, పటాన్చెరు, అమీన్పూర్, ఆర్సీ పురం, బీరంగూడ, కొల్లూరు ప్రాంతాలతో పాటు కీసర, ఘట్కేసర్, అనోజిగూడ పరిసరాల్లో సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు చేరడంతో వరద ఉధృతికి కొన్ని చోట్ల పార్క్ చేసిన వాహనాలు నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది.