థాంక్స్‌గివింగ్ వేడుకల వేళ అమెరికాను భారీ తుపాను వణికించింది. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో జనజీవనం స్తంభించింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో 7.24 లక్షలకు పైగా మంది ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తగా, చెట్లు విరిగిపడి ఇళ్లపై కూలాయి. కీలక వంతెనను అధికారులు మూసివేశారు. వందల సంఖ్యలో విమాన సర్వీసుల రద్దు, ఆలస్యాలతో పండుగ ప్రయాణాలు అస్తవ్యస్తమయ్యాయి.