నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్ నుంచి బెంగళూరుకు 34 మంది ప్రయాణికులతో మణికంఠ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బయలుదేరింది. అయితే బస్సు నెల్లూరు జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఫైర్ అలారం మోగడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్దు పక్కన ఆపేసి ప్రయాణికులను బస్సు నుంచి కిందకు దించాడు. కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో అది పూర్తిగా కాలిపోయింది.